Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking News

Gold Price : పడిపోయిన పసిడి ధర.. వరుసగా రెండో రోజు భారీగా రూ.13,100 తగ్గింది..!

Gold Price : పడిపోయిన పసిడి ధర.. వరుసగా రెండో రోజు భారీగా రూ.13,100 తగ్గింది..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర ఒకేసారి పడిపోయింది. వరుసగా రెండో రోజు భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా మహిళలు బంగారం కొనుగోళ్లకు ఆసక్తి కనబరిస్తున్నారు. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు తగ్గిన బంగారం ధర మళ్ళీ ఐదు రోజులపాటు వరుసగా పెరిగింది. కాగా తిరిగి నవంబర్ 25వ తేదీ నుంచి మళ్లీ ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండో రోజు కూడా (మంగళవారం) బంగారం ధర భారీగా తగ్గింది.

నవంబర్ 25వ తేదీన 24 క్యారెట్స్ 100 గ్రాములకు 7,85,500 రూపాయలు ఉండగా నవంబర్ 26వ తేదీన 13,100 తగ్గి 7,72,400 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్ 7,20,000 ఉండగా 12,000 రూపాయలు తగ్గి 7,08,000 గా ఉంది.

నవంబర్ 26 (మంగళవారం) ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 13,100 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ ధర 12,000 తగ్గింది. 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాములు (తులం) రూ.77,240కాగా 22 క్యారెట్స్ 70,800 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ తోపాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

హైదరాబాదులో బంగారం ధరలు (నవంబర్ 26)
24 క్యారెట్స్ :

ఒక గ్రాము 7724 రూపాయలు

8 గ్రాములు 61,792 రూపాయలు

10 గ్రాములు 77,240 రూపాయలు

100 గ్రాములు 7,72,400 రూపాయలు

22 క్యారెట్స్ :

ఒక గ్రాము 7080 రూపాయలు

8 గ్రాములు 56,640 రూపాయలు

10 గ్రాములు 70,800 రూపాయలు

100 గ్రాములు 7,08,000 రూపాయలు గా ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు