Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణవ్యవసాయం

Runamafi : రైతు రుణమాఫీ పై తాజా అప్డేట్..!

Runamafi : రైతు రుణమాఫీ పై తాజా అప్డేట్..!

మన సాక్షి ,వెబ్ డెస్క్:

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేసింది. 18 వేల కోట్ల రూపాయలను విడుదల చేసి 22 లక్షల మేరకు రైతులకు రుణమాఫీ అయ్యింది.

కాగా సాంకేతిక కారణాల వల్ల అందరి రైతులకు రుణమాఫీ దక్కలేదు. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహించింది. రుణమాఫీ కానీ రైతుల దరఖాస్తుల మేరకు వ్యవసాయ అధికారులు ఇంటింటికి వెళ్లి కుటుంబ నిర్ధారణ సర్వే పూర్తి చేశారు.

కాగా ఇంకా 12 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ప్రభుత్వం చేయాల్సి ఉంది. కాగా రైతులు ఇట్టి స్థాయి రుణమాఫీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ పై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు. ఎవరికీ ఇష్టం వచ్చిన రీతిలో వారే రుణమాఫీ డేట్ ఫిక్స్ చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రుణమాఫీ ఎప్పుడు అనేది వెల్లడించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ భారతదేశంలోనే రుణమాఫీ చరిత్ర సృష్టించింది అని పేర్కొన్నారు.

జనవరి మాసాంతానికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9వ తేదీ రుణమాఫీ పై కీలక ప్రకటన చేస్తారని ఎదురుచూస్తున్న రైతులకు మళ్ళీ నిరాశే కలిగింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తుండగా ప్రజా సంబరాలు నిర్వహిస్తున్నారు.

కానీ రైతుల రుణమాఫీ ప్రక్రియ మాత్రం పూర్తిస్థాయిలో కాలేదు. డిసెంబర్ మాసంలో పూర్తిస్థాయిలో రుణమాఫీ ప్రక్రియ చేపడితే జనవరి మాసంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని రైతులు భావించారు. కానీ తాజాగా ఉత్తంకుమార్ రెడ్డి ప్రకటనతో మరో నెల పోస్ట్ పోన్ అయింది. జనవరి మాసంతం వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని ప్రకటించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు