District collector : వికారాబాద్ జిల్లా కలెక్టర్ వాహనంపై రాళ్లదాడి.. తీవ్ర ఉద్రిక్తత..!
District collector : వికారాబాద్ జిల్లా కలెక్టర్ వాహనంపై రాళ్లదాడి.. తీవ్ర ఉద్రిక్తత..!
వికారాబాద్, మన సాక్షి :
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు నిరసన సెగ తగిలింది. ఆయన కారుపై లగచర్ల గ్రామస్తులు రాళ్లదాడి చేశారు. సోమవారం గ్రామానికి వెళ్లిన జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల వాహనాలపై గ్రామస్తులు రాళ్లు, కర్రలతో దాడి చేసి ధ్వంసం చేశారు. వివరాల ప్రకారం..
ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా రైతులతో చర్చించేందుకు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఊరు బయట చర్చలు చేయడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ చర్చలకు గ్రామ వెలుపల ఏర్పాటు చేసిన గ్రామ సభకు రైతులు గైరాజరయ్యారు. ఫార్మా విలేజి ఏర్పాటుపై రైతులు అభ్యంతర వ్యక్తం చేశారు. దాంతో రైతులతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ గ్రామానికి రాగానే రైతులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ వెనక్కి వెళ్లాలని ఆందోళన చేశారు.
గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కారుపై రాళ్లు విసిరారు. దాంతో కారు అద్దాలు పగిలాయి. కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారిపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ సంఘటనతో అధికారులు గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
MOST READ :









