Vinayaka Statues : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు మించి ఆకర్షవంతంగా.. మట్టి వినాయక విగ్రహాలు తయారీ..!
Vinayaka Statues : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు మించి ఆకర్షవంతంగా.. మట్టి వినాయక విగ్రహాలు తయారీ..!
మట్టి వినాయక విగ్రహాల తయారీలో ఇంటిల్లిపాది..!
మట్టి వినాయకులే ముద్దు…ప్లాస్టర్ అఫ్ పారిస్ వద్దు
మట్టి విగ్రహాలకు కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదని ఆవేదన
శ్రీకాకుళం, పాతపట్నం, మనసాక్షి ప్రతినిధి :
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రం లో స్థానిక గాయత్రి నగర్ కాలనీ వద్ద మట్టి వినాయక ప్రతిమలను రాజాన శ్రీను,సతీమణి ఆది లక్ష్మి, తమ్ముడు వెంకటరమణ లు మట్టి వినాయక ప్రతిమలను చాలా అద్భుతంగా తయారుచేసి వాటికి మంచి రంగులు వేసి వాటికి జీవకళ వచ్చేలా సిద్ధం చేస్తున్నారు.
చిన్న విగ్రహాల నుండి పెద్ద విగ్రహాల వరకు ఎంతో శ్రమించి వారు మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. పెద్ద విగ్రహాలు చేసేందుకు సుమారు రెండు నెలలు కష్టపడాల్సి వస్తుందని వారు తెలిపారు.ఒక్కో సైజును బట్టి వాటి ధరలు ఉంటాయని అన్నారు.
నిమజ్జనం సమయంలో మట్టి వినాయకులు నీటిలో కరిగిపోతాయని దీని వల్ల ఎటువంటి జల కాలుష్యం ఉండదని అదే ప్లాస్టర్ అఫ్ పారిస్ వల్ల అవి నీటిలో కరుగక వాటి వ్యర్ధాలు వల్ల జల కాలుష్యం సంభవిస్తుందని అన్నారు.
కష్టానికి తగ్గ ఫలితం లేదని ఆవేదన :
ఇంటిల్లపాధి రెండు నెలలు శ్రమిస్తే తప్ప మట్టి విగ్రహాలు తయారు కావని కానీ ఇప్పుడు ప్లాస్టర్ అఫ్ పారిస్ తో అచ్చులతో తయారు చేసిన విగ్రహాలు వాటితో వచ్చే అనర్ధం అని తెలిసినా ప్రభుత్వం వాటి పై చర్యలు తీసుకోక పోవడం వల్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని అందువల్ల మట్టి వినాయకులకు డిమాండ్ తగ్గిపోయి మాకు నష్టం కలుగుతుందని రాజాన శ్రీను, వెంకటరమణ వాపోయారు.
ప్రక్క రాష్ట్రం ఒడిస్సా గజపతి జిల్లా ప్రభుత్వం ప్లాస్టర్ అఫ్ పారీస్ విగ్రహాలు విక్రయించేందుకు అనుమతి నిషేధించడంతో వారు సరిహద్దు ఆంధ్ర ప్రాంతమైన పాతపట్నం లో వాటిని తెచ్చి ఇక్కడ విక్రాయిస్తున్నారని దీని ద్వారా మా వ్యాపారం దెబ్బతింటుందని ఆవేదన చెందారు.
మా లాంటి వారి సమస్యలు ప్రభుత్వం అర్ధం చేసుకొని ప్లాస్టర్ అఫ్ జిపారిస్ తో తయారు చేసే విగ్రహాలను విక్రయించేందుకు అనుమతులు నిషేదించాలని కోరారు.
ALSO READ :
- Crime News : దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్.. చాకచక్యంగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు..!
- సూర్యాపేట : ఏపూర్ గ్రామాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం
- Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
- Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)










