Viral News : 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. భయంతో తల్లిదండ్రులు, 8వ తరగతి బాలుడు మాస్టర్ ప్లాన్..!
సైబర్ నేరగాళ్లు అమాయకులను ఆసరా చేసుకుని డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. విద్యావంతులు కూడా మోసాలకు గురవుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలికి చెందిన ఓ కుటుంబాన్ని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు 10 గంటల పాటు ఆ దంపతులకు చుక్కలు చూపించారు. కాగా వారి కుమారుడు 8వ తరగతి బాలుడు తన తెలివితేటలతో మాస్టర్ ప్లాన్ వేశాడు.

Viral News : 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. భయంతో తల్లిదండ్రులు, 8వ తరగతి బాలుడు మాస్టర్ ప్లాన్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
సైబర్ నేరగాళ్లు అమాయకులను ఆసరా చేసుకుని డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. విద్యావంతులు కూడా మోసాలకు గురవుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలికి చెందిన ఓ కుటుంబాన్ని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు 10 గంటల పాటు ఆ దంపతులకు చుక్కలు చూపించారు. కాగా వారి కుమారుడు 8వ తరగతి బాలుడు తన తెలివితేటలతో మాస్టర్ ప్లాన్ వేశాడు. దాంతో తల్లిదండ్రులను ప్రమాదం నుంచి రక్షించాడు. ప్రస్తుతం ఆ కుర్రాడి సాహసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వివరాల ప్రకారం.. బరేలికి చెందిన వ్యాపారి సంజయ్ సక్సేన భార్యకు ఒక అపరిచిత నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము దర్యాప్తు సంస్థ నుంచి మాట్లాడుతున్నామని, సంజయ్ సక్సేనాకు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని, దానివల్ల కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని బెదిరించడంతో పాటు మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేశామని కెమెరా ముందే ఉండాలని ఇల్లు వదిలి వెళ్ళవద్దని హుఖం జారీ చేశారు.
పది గంటల పాటు వీడియో కాల్ లో ఉన్న ఆ కుటుంబం కు నకిలీ అరెస్టు పత్రాలను కూడా చూపించి భయపెట్టారు. భోజనం చేసినా, నిద్రపోయినా.. కెమెరా ముందే కనిపించాలని వేధింపులకు గురిచేశారు. దాంతో వారి కుమారుడు 8వ తరగతి చదువుతున్న తన్మయ్ తన స్కూల్లో సైబర్ సెక్యూరిటీ అవగాహన గురించి తెలుసుకున్నాడు. అతడు తల్లిదండ్రులు డిజిటల్ అరెస్టుకు గురయ్యారని గుర్తించాడు.
తన మొబైల్ తో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అంతటితో ఆగకుండా తల్లిదండ్రుల ఫోన్లో ఏరోప్లేన్ మోడ్ లోకి మార్చేశాడు. దాంతో నేరగాళ్ల కనెక్షన్ కట్ అయింది. ఆ తర్వాత ప్రేమ్ నగర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయగా.. ఆ సమయంలో ఫోన్ ఆన్ చేయగానే నేరగాళ్లు మళ్లీ కాల్ చేశారు. దాంతో పోలీసుల స్వయంగా మాట్లాడారు.
అనంతరం ఎస్పీ మనిష్ పరీక్ మాట్లాడుతూ.. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతే లేదని దర్యాప్తు సంస్థలు ఎప్పుడు కూడా వీడియో కాల్స్ చేసి అరెస్టు చేయవని, ఇలాంటి ఫోన్ కాల్స్ కు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు భయంతో వణికి పోతుంటే ఎనిమిదో తరగతి బాలుడు చూపిన ధైర్యానికి ఆదర్శం అని మనం ఎంత చదువుకున్నాం అనేది కాదని, సైబర్ నేరాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉన్నామనేది ముఖ్యమని, ఈ ఘటన నిరూపిస్తుంది.
VIRAL NEWS :
- Viral Video : తండ్రిని గోనె బస్తాలో కుక్కి కొరియర్ ఆఫీసుకు తీసుకెళ్లిన కూతురు.. (వీడియో)
- Viral : ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్య.. నవ్వుతూ వీడియో తీసిన సైకో భర్త.. (వీడియో వైరల్)
- Viral Video : పాత సామాను తెచ్చిన అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..!
- Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)









