TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

ఆల్మట్టి నుంచి దిగువకు నీరు.. సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు..!

ఆల్మట్టి నుంచి దిగువకు నీరు.. సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

కృష్ణ బేసిన్ లో కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండాయి. ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. కర్ణాటకలోని కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులన్ని నిండాయి. ఆల్మట్టి డ్యామ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రి 7 గంటలకు ఆల్మట్టి నుంచి 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం లో పూర్తిస్థాయి నీటిమట్టం 519.60 కాగా ప్రస్తుతం 517.52 టీఎంసీల నీరు ఉంది. ఈ ప్రాజెక్టుకు పైనుంచి 28,130 క్యూసెక్కుల నీరు చేరుతుంది. దిగువకు 15000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో 37.64 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టంకు గాను 25. 815 టీఎంసీల నీరు ఉంది. ఈ ప్రాజెక్టుకు ఏగువనుంచి 3413 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

రైతుల ఎదురుచూపు

ఇది ఇలా ఉండగా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీరు ఎప్పుడు వస్తుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని రైతులు వానాకాలం సీజన్ లో నీటి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు వరి నారులు పోసుకొని, దుక్కులు దున్నుకొని ఎదురుచూస్తున్నారు. ఆల్మట్టి నుంచి వరద నీరు చేరితే వానకాలం పంటలు పండించుకోవచ్చని రైతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

గత ఏడాది బీడు భూములే :

గత ఏడాది కృష్ణా బేసిన్ లో వర్షాలు లేకపోవడం వల్ల నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేయలేదు. గత ఏడాది వానాకాలం సీజన్ తో పాటు యాసంగి సీజన్ లో కూడా సాగునీటిని విడుదల చేయకపోవడం వల్ల ఆయకట్టు భూములన్ని భీళ్లుగా మారాయి. కేవలం బోర్లు బావులు ఆధారం ఉన్న రైతులు మాత్రమే కొద్దిగా సాగు చేశారు. మిగతా భూములన్నీ భీళ్ళుగా మిగిలిపోయాయి. దాంతో ఈ ఏడాది వర్షాలు వస్తే పంటలు పండించుకోవచ్చని రైతుల ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. త్వరలో హయత్ నగర్ వరకు మెట్రో..!

Shooting at Trump rally : అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కాల్పులు.. గాయాలతో ఆసుపత్రికి.. (వీడియో వైరల్)

TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!

మరిన్ని వార్తలు