Miryalaguda : మిర్యాలగూడలో ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయి.. ఎన్నికల ముందు కొత్త నాటకం..!
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మిర్యాలగూడలో గతంలో నిర్వహించిన ప్రజా పాలన సభల ద్వారా స్వీకరించిన దరఖాస్తులు ఏమయ్యాయని బిజెపి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిలుకూరు రమాదేవి శ్యామ్ ఒక ప్రకటన ద్వారా ప్రశ్నించారు.

Miryalaguda : మిర్యాలగూడలో ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయి.. ఎన్నికల ముందు కొత్త నాటకం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మిర్యాలగూడలో గతంలో నిర్వహించిన ప్రజా పాలన సభల ద్వారా స్వీకరించిన దరఖాస్తులు ఏమయ్యాయని బిజెపి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిలుకూరు రమాదేవి శ్యామ్ ఒక ప్రకటన ద్వారా ప్రశ్నించారు. మిర్యాలగూడలో శాసనసభ్యులు ఎన్నికల ముందు కొత్త నాటకం తెరలేపారని విమర్శించారు.
రాష్టంలో ఎక్కడ లేని విధానం మిర్యాలగూడ లో అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ప్రజలను మోసం చేస్తున్నారని, గతంలో ప్రజా పాలన పేరుతో అన్ని వార్డులలో మీటింగులు పెట్టి తీసుకున్న అప్లికేషన్లు ఎక్కడకు పోయినాయన్నారు. గడిచిన 2 సంవత్సరాల పాలనలో డ్రా ద్వారా వచ్చిన అర్హులకు డబల్ బెడ్ రూంలు ఎందుకు ఇవ్వలేదని, ఈ కొత్త నాటకం ఎందుకు అన్నారు.
మిర్యాలగూడ ప్రజలను అధికార పార్టీ ఎందుకు మోసం చేస్తున్నారని, ప్రభుత్వం నుండి ఎలాంటి గెజిట్ లేకుండా అధికారులు ఏందుకు సహకరిస్తున్నారని అన్నారు. మున్సిపల్ కమీషనర్, తహసీల్దార్ లకు ఫోన్ చేసి మాట్లాడితే వారు స్పందించి ఎలాంటి సమాచారం లేదు, మాకు ఎలాంటి గైడ్ లెన్స్ లేదు అని చెప్పినారని, అసలు మిర్యాలగూడ పరిధిలో ఎక్కడ భూమిని సర్వే చేసి సేకరించారో వివరాలు తెలపాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మిర్యాలగూడ ప్రజలను మోసం చేయడానికి చేస్తున్న మోసాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ మోసాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజా చైతన్యం ద్వారా అధికార పార్టీ మోసాలను ఎండగడతామని హెచ్చరిస్తున్నామన్నారు.
MOST READ
-
Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!
-
Sankranti Special : రాజమండ్రికి మించిన మర్యాద.. కొత్త అల్లుడికి 158 వంటకాలతో సంక్రాంతి విందు..!
-
CM Revanth Reddy : తెలంగాణకు సైనిక్ స్కూలు మంజూరు చేయండి..!
-
సంక్రాంతి వేళ.. కోడిపందాల్లో రికార్డ్, రూ.1.53 కోట్ల భారీ పందెం..!









