TOP STORIESఆంధ్రప్రదేశ్

ఏమైందమ్మా.. చినబోయావు ఎందుకని.. మనసు గెలిచిన మానవత్వం..!

రోడ్డు ప్రమాదంలో మనిషి గాయపడితేనే పట్టించుకోకుండా చూస్తూ వెళ్ళిపోయే రోజులివి. అలాంటిది ఓ వానరం రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న దానిని తెచ్చి 15 రోజులుగా సపర్యలు, వైద్య సేవలు అందించి కోలుకునేలా చేశారు.

ఏమైందమ్మా.. చినబోయావు ఎందుకని.. మనసు గెలిచిన మానవత్వం..!

మదనపల్లి, మన సాక్షి :

రోడ్డు ప్రమాదంలో మనిషి గాయపడితేనే పట్టించుకోకుండా చూస్తూ వెళ్ళిపోయే రోజులివి. అలాంటిది ఓ వానరం రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న దానిని తెచ్చి 15 రోజులుగా సపర్యలు, వైద్య సేవలు అందించి కోలుకునేలా చేశారు.

మానవత్వాన్ని చాటారు. గ్రామస్తులు, హనుమాన్ భక్తుల కథనం మేరకు.. మదనపల్లి-అంగళ్లు మార్గంలోని కెఎన్ఆర్ పంక్షన్ హాల్ దగ్గర 15 రోజుల క్రితం ఓ వానరాన్ని లారీ ఢీకొట్టి వెళ్ళిపోయింది. రోడ్డు పక్కన చావుబతుకుల మధ్య అచేతనంగా పడి ఉన్న దానిని అంజనేయ స్వామి గుడి వద్ద కొబ్బరి కాయలు విక్రయించే రాజమ్మ చూసి చలించిపోయింది.

వెంటనే దానిని పక్కనే ఉన్న భారీ ఆంజనేయ విగ్రహ నిర్వాహకులు లూబీ విశ్వనాథ్ వద్దకు తీసుకెళ్లింది. వారు ఆలస్యం చేయకుండా కారులో హుటాహుటిన పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర చికిత్స చేయించారు. వారి ఆశ్రమ సంరక్షణలోనే ఉంచుకుని సపర్యలు చేయసాగారు.

మరో వైపు అంగళ్ళు పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ శ్రీదర్ రెడ్డి సిబ్బందిని పురమాయించి ప్రతి రోజు దానికి చికిత్సలు చేయడంతో పాటు మందులు, ఇంజక్షన్లు ఇప్పించసాగారు. భక్త హనుమాన్ ఆశ్రమ నిర్వాహకులు కోసూరి (లూబీ) విశ్వనాధ్, ఎలక్ట్రీషియన్ పిటియం రామకృష్ణ, నార్లపల్లి మాంగాని రమణారెడ్డి, మరో భక్తురాలు ఎర్రదొడ్డి గంగులమ్మ ప్రత్యేక శ్రద్ధ వహించారు.

స్థానిక పశు వైద్య సిబ్బంది ఎన్జీ ధరణీనాథ్ రెడ్డి, కనసానివారిపల్లి నిర్మల వానరానికి ఇంజక్షన్లు, అవసరమైన మందులు క్రమంగా రోజూ ఇస్తూ వచ్చారు. గాయాలు మానుతూ క్రమేణా కోలుకుంటూ ఆశ్రమం వద్ద తిరుగులాడుతూ మునుపటి స్థితికి వస్తోంది.

ఓ వానరం కోసం ప్రతి రోజా ఏడి స్థాయి అధికారితో సహా ఎనిమిది మంది కనిపెట్టుకుని సపర్యలు చేయడం పలువురిని చలింపజేస్తోంది. వానరానికి పునరుజ్జీవం కల్పించిన వారి మానవత్వాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

By : SIDDALA KODANDA RAMREDDY,  97039 66653

MOST READ 

  1. Supreme Court : ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం..!

  2. Tragedy : శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం. తెలంగాణకు చెందిన దంపతులు మృతి..!

  3. Big Alert : హైదరాబాద్ వెళ్లే వాహనాల దారి మళ్లింపు.. ట్రాఫిక్ రద్దీ తో ప్రత్యామ్నాయ మార్గాలు..!

  4. JalliKattu : జల్లికట్టులో తీవ్ర విషాదం.. 52 మందికి గాయాలు..!

మరిన్ని వార్తలు