TOP STORIESBreaking News

WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!

WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!

మనసాక్షి, వెబ్ డెస్క్:

సమాచారం పంపడానికి, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడానికి ఎక్కువమంది వినియోగించే యాప్ వాట్సప్. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దిమంది వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అయితే వాట్సప్ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది.

ఇకపై ఎక్కువ మందికి గ్రూపులో మెసేజ్ పంపాలంటే మ్యాటర్ టైప్ చేసి పెట్టాల్సి ఉండేది. ఇకపై అలాంటి అవసరం లేదు. వాయిస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గతంలో కూడా వాయిస్ ఫీచర్ వాట్సప్ లో ఉండేది. కానీ కేవలం గ్రూపులో ఉన్న రెండు నుంచి నలుగురు సభ్యులు మాట్లాడుకునే అవకాశం మాత్రమే ఉండేది. ఇకపై కొత్త ఫీచర్ రావడంతో గ్రూపులో ఉన్న సభ్యులకు సుమారు 100 మందితో ఒకేసారి వాయిస్ ఫీచర్ ద్వారా మాట్లాడుకునే అవకాశం ఉంది.

ఏదైనా సంస్థ ఉద్యోగులు అందరూ ఒకేసారి మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. ఇది గ్రూప్ సభ్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ ను ఆండ్రాయిడ్, ios వినియోగదారుల కోసం వాట్సాప్ దీనిని విడుదల చేసింది. ఇంకా కొన్ని ఫోన్ లకు రాలేదు. అప్డేట్ చేసుకుంటే వస్తుంది.

Similar News : 

  1. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే ప్రైవసీ.. సెండ్ చేసినా సేవ్ చేసుకోలేరు..!

  2. WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!

  3. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!

  4. WhatsApp Chats : మీరు ఇలా చాట్ చేస్తున్నారా.. అయితే మీ బంధం బలహీన పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు