Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsటెక్నాలజీ

WhatsApp : వాట్సప్ సంచలన నిర్ణయం.. ఇక సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు.. తెలుసుకోండి..!

WhatsApp : వాట్సప్ సంచలన నిర్ణయం.. ఇక సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు.. తెలుసుకోండి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రస్తుత ప్రపంచంలో ప్రతి పనికి వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. నేటి ప్రపంచంలో అతి వేగంగా సమాచారం, ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో పాటు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్, కూడా వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను అందిస్తుంది.

వాట్సాప్ నిర్వహణపై మెటా సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. వాట్సాప్ లో మొట్ట మొదటిసారిగా అడ్వర్టైజ్మెంట్ రానున్నట్లు ప్రకటించింది. అప్డేట్స్ ట్యాబ్ లో ఈ యాడ్స్ కనిపించనున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది.

అయితే వాట్సాప్ చానల్స్, స్టేటస్ ఫీచర్ల కోసం సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయనున్నట్లు వాట్సప్ ప్రకటించింది. వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ ప్రకారం చానల్ యజమానులు సభ్యుల నుండి నెలవారి సబ్ స్క్రిప్షన్ ఫీజు వసూలు చేసి ఎక్స్ క్లూజివ్ అప్డేట్లను అందించవచ్చునని పేర్కొన్నది. ఈ మార్పులు కేవలం వాట్సాప్ చానల్స్, స్టేటస్ ఫీచర్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.

వాట్సాప్ 1.5 బిలియన్ యూజర్లకు ప్రధానంగా చాట్ పేజీలో ఎటువంటి మార్పు ఉండదు. వాట్సప్ లో కొత్త ఆదాయ మార్గాలను సృష్టించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సాధారణ చాట్ చేసే వారికి ఎటువంటి ఫీజు వసూలు లేకపోవడంతో యూజర్లకు ఉపశమనం కలిగింది.

ఇవి కూడా చదవండి:

  1. Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Gunde Ninda Gudigantalu : ఇలా రా.. తలుపు వేయి.. రోహిణి గొంతు పట్టిన ప్రభావతి.. (ఎపిసోడ్ 16 జూన్)

  3. Nalgonda : వీడు మామూలోడు కాదు.. బంగారం పేరుతో ఘరానా మోసం..!

  4. Miryalaguda : నీట్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయ స్థాయి ర్యాంకులు..!

  5. Rythu Bharosa : టింగ్..టింగ్..టింగ్.. మోగుతున్న పోన్లు.. వారికి బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!

  6. District collector : రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ రైతు నేస్తం లో ముఖాముఖి..!

మరిన్ని వార్తలు