తెలంగాణBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా, ఆత్మీయ భరోసా అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే.. బిగ్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా, ఆత్మీయ భరోసా అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే.. బిగ్ అప్డేట్..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా పథకంలో ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు రైతులకు పంట సహాయం అందజేశారు.

గత ప్రభుత్వం ఏడాదికి రెండు పంటలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఎకరానికి చేసిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు రైతులకు పంట సహాయం అందజేసింది. కాగా మిగతా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయ కూలీల కోసం ప్రారంభించింది. రైతు కూలీలను ఆదుకునేందుకుగాను ఈ పథకం కింద ఏడాదికి 12 వేల రూపాయలను అందజేస్తుంది. ఈ పథకాన్ని 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభించి వెంటనే ఎన్నికల కోడ్ కారణంగా నిలిచి పోయింది. కోడ్ లేని జిల్లాలలో అందజేసింది.

మిగతా జిల్లాలకు సంబంధించిన రైతు కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తుండగా మంత్రి సీతక్క అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మార్చి 31వ తేదీ లోపు రైతు భరోసా, ఆత్మీయ భరోసా పూర్తిస్థాయిలో అందజేస్తామని ఆమె ప్రకటించారు.

MOST READ :

  1. TG News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రామ పాలన అధికారి పోస్టుల మంజూరుకు ఉత్తర్వులు జారీ..!

  2. Mahila Rythu : మహిళా రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్.. వారికి 50% రాయితీ..!

  3. Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

  5. WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

మరిన్ని వార్తలు