Traffic : మీ బండ్లకు, కార్లకు ఈ చలాన్లు చెల్లించడం లేదా.. అయితే భారీ షాక్.. కొత్త పెనాల్టీలు..!
Traffic : మీ బండ్లకు, కార్లకు ఈ చలాన్లు చెల్లించడం లేదా.. అయితే భారీ షాక్.. కొత్త పెనాల్టీలు..!
మన సాక్షి :
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే అధికారులు పెనాల్టీ విధిస్తారనే సంగతి తెలుసు. హెల్మెట్ ధరించకుంటే, లైసెన్స్ లేకుంటే, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్ ఇలా ఒక్కొక్క రూల్ కు ఒక్కొక్క ఫైన్ ఉంటుంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా ఈ చలాన్ లను అమలు చేస్తున్నారు. అయితే చాలామంది చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకు ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
ఈ చలాన్ ఏముందిలే చెల్లించడం అని నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం ఆంక్షలు తీసుకొచ్చింది. మూడు నెలల కంటే ఎక్కువ కాలం చలాన్ చెల్లించకుంటే డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలిక రద్దు చేయాలని నిర్ణయించింది. దాంతో పాటు ఒక సంవత్సరంలో రెడ్ సిగ్నల్ జంప్ చేస్తూ మూడుసార్లు దొరికితే లేక ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే వారి లైసెన్సు రద్దు చేసే ప్రణాళికలు తీసుకురాబోతున్నారు.
దాంతోపాటు ట్రాఫిక్ చలాన్ లను వ్యక్తి వాహన ఇన్సూరెన్స్ ప్రీమియం కి కూడా లింక్ చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ చలాన్ల రికవరీ అతి తక్కువగా 14 శాతం మాత్రమే ఉంది. మహారాష్ట్ర, హర్యానాలో అత్యధికంగా 62 నుంచి 76% చలాన్ రికవరీ రేటు ఉంది. అయితే త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా చలాన్ రికవరీ డ్రైవ్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో మాదిరిగా ప్రభుత్వం డిస్కౌంట్లు ప్రకటించే వరకు ఆగకుండా ముందుగానే తమ వాహనాలపై పెండింగ్ జలాలను క్లియర్ చేసుకోవడం చాలా ఉత్తమం.
ట్రాఫిక్ రూల్స్.. హైదరాబాదులో కొత్త పెనాల్టీలు.. ఇవే :
-
మద్యం తాగి వాహనం నడిపితే పదివేల రూపాయల వరకు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష
-
సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే వెయ్యి రూపాయల జరిమానా
-
త్రిబుల్ రైడింగ్ చేస్తే 1000 రూపాయల జరిమానా
-
హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే వెయ్యి రూపాయల జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష
-
డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగిస్తే 5000 రూపాయల జరిమానా
-
వాల్యూడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే 5000 రూపాయల జరిమానా
-
ప్రమాదకరంగా రాష్ డ్రైవింగ్ చేస్తే 5000 రూపాయల జరిమానా
-
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే పదివేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష
-
సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేస్తే 2000 రూపాయల నుంచి 4 వేల రూపాయల వరకు జరిమానా
-
ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే పదివేల రూపాయల జరిమానా
-
ఓవర్ స్పీడ్ గా వాహనాలను నడిపితే 5000 రూపాయల జరిమానా
-
సిగ్నల్ జంప్ చేస్తే 5000 రూపాయల జరిమానా
-
మైనర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే 25 వేల రూపాయల జరిమానా
MOST READ :
-
TG News : తెలంగాణ బియ్యం తొలి రవాణా.. కాకినాడ పోర్టు నుండి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి..!
-
CM Revanth Reddy : చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!
-
Toll Tax : టోల్ టాక్స్ తగ్గిందోచ్.. వాహనదారులకు భారీ ఊరట..!
-
TG News : తెలంగాణలో మరో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం..!
-
TG News : సర్పంచ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!
-
Hyderabad : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్ న్యూస్..!










