TGSRTC : ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లొద్దని ఎవరు రూల్ పెట్టారు.. బస్సు ఎదుట మహిళ నిరసన.. (వీడియో)
TGSRTC : ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లొద్దని ఎవరు రూల్ పెట్టారు.. బస్సు ఎదుట మహిళ నిరసన.. (వీడియో)
మన సాక్షి, నల్గొండ :
ఆర్టీసీ బస్సులో ఓ మహిళ కల్లు తీసుకెళ్తుండగా కండక్టర్ దించేసింది. కల్లు తీసుకెళ్ళొదంటూ బస్సు ఆపి ఆ మహిళను బస్సు దించింది. అయితే ఆమె కల్లు తీసుకెళ్లొద్దని ఎవరు రూల్ పెట్టారంటూ.. ఏకంగా బస్సు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల ప్రకారం..
నల్గొండ జిల్లా నకిరేకల్ శివారులో ఈ సంఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సూర్యాపేట నుంచి నల్గొండ వెళుతుండగా నకిరేకల్ వద్ద ఓ మహిళ రెండు సంచులతో బస్సు ఎక్కింది. ఆమె తీసుకొచ్చిన సంచుల్లో కల్లు బాటిల్ ఉండడంతో మహిళా కండక్టర్ అభ్యంతరం తెలిపింది.
అదే సమయంలో డ్రైవర్ కూడా జోక్యం చేసుకొని కల్లుబాటిల్ తో బస్సు ఎక్కవద్దని చెప్పాడు. దాంతో ఆగ్రహానికి గురైన మహిళ ఎందుకు కల్లు తీసుకెళ్ల వద్దో చెప్పాలని డిమాండ్ చేసింది. దాంతో ఆ మహిళ బస్సు దిగి బస్సు ఎదుట నిల్చొని నిరసన వ్యక్తం చేసింది.
బస్సులో కల్లు తీసుకెళ్లొద్దు అని ఎవరు రూల్ పెట్టారంటూ ప్రశ్నించింది. ఆ తర్వాత ఆ మహిళ కొద్దిసేపటికి ఆటోలో వెళ్ళింది. కాగా ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సులో కల్లు తీసుకెళ్లొద్దని పేర్కొంటున్నారు.
Video :
ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకురావద్దని మహిళను దించేసిన డ్రైవర్
నల్గొండలో బస్సును ఆపి మహిళ నిరసన pic.twitter.com/Cv5L4U5dVb
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2025
VIRAL VIDEOS :
Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)
Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)









