తనకు, తన కూతురికి న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు భార్య ధర్నా..!
తనకు, తన కూతురికి న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు భార్య ధర్నా..!
నల్లగొండ, మనసాక్షి:
తనకు తన పాపకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ ఆడకూతురు తన భర్త ఇంటి ముందు ధర్నా చేసిన సంఘటన సోమవారం జరిగింది.
ఆడకూతురు తెలియజేసిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని బొట్టు గూడా కు చెందిన తనను 2019లో నల్లగొండ పట్టణం పానగల్ రోడ్డు శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన మాచర్ల రాములు కుమారుడు మాచర్ల వెంకటకృష్ణకు ఇచ్చి వివాహం జరిపారని వివాహ సమయంలో 25 కులాల బంగారం 25 లక్షల కట్నం ఇచ్చారని తెలిపింది.
అయితే తన వివాహం జరిగిన 11 నెలలకే తన భర్త వెంకటకృష్ణ గుండెపోటుతో మరణించాడని అప్పటికే తాను గర్భవతినని తన భర్త చనిపోయిన తర్వాత 25 రోజులకు తాను శిశువును కన్నానని తెలిపింది. తన మామ కూడా మూడు నెలల క్రితం మరణించాడని ఆమె తెలిపింది.
తనకు తన భర్త ఉద్యోగమైన విద్యుత్ శాఖలో ఆర్టిజన్ ఉద్యోగం రావడంతో తన భర్త కు చెందిన ఇంటిలో తనను ఉండనీయకుండా తన ఆడపడుచులు ముగ్గురు అడ్డుకుంటున్నారని దీంతో తాను వేరే ఇంటిలో అద్దెకుంటూ జీవిస్తున్నానని తన భర్తకు చెందిన ఇంటిలో తనను ఉండనీయాలని ఆమె డిమాండ్ చేస్తూ అదే ఇంటి ముందు బంధువులతో కలిసి ధర్నా చేస్తుంది.
తన ఆడపడుచులు వాళ్ళ భర్తలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థాయిలో ఉండడం వలన తనను తన భర్తకు చెందిన ఇంట్లో ఉండనీయకుండా చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ట్లు తెలిపింది.
తాను ఇచ్చిన కట్నంతోనే ఇంటి పైన మరో అంతస్తు నిర్మించారని దానిని తన ఆడపడుచులు అద్దెకు ఇచ్చారని వాపోయింది తనను ఇంట్లోకి రానీయకుంటే తాను తన పాప ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది.
LATEST UPDATE :









