Miryalaguda : ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ మృతి.. కారకులైన డాక్టర్ ని సస్పెండ్ చేయాలని ధర్నా..!

Miryalaguda : ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ మృతి.. కారకులైన డాక్టర్ ని సస్పెండ్ చేయాలని ధర్నా..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం మహిళ మృతి చెందింది. చికిత్స కోసం మహిళ రావడంతో డ్యూటీలో ఉన్న డాక్టర్ పట్టించుకోకపోవడం వల్ల ఆమె మృతి చెందిందని సిపిఐ నాయకులు ఆరోపిస్తూ ఏరియా ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మిర్యాలగూడ మండలం ములకల కాల్వ కు చెందిన నాగిల్లి ఎంకమ్మ దగ్గు, జ్వరము, ఆయాసంతో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమెను కొడుకు ప్రదీప్ మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకొని రావటం జరిగిందన్నారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టరు డ్యూటీ నుంచి దిగిపోయేంతవరకు ఆ ఎంకమ్మ కు ట్రీట్మెంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయటం వలన ఆమెకు ఆయాసం ఎక్కువైందన్నారు.
ఆమెకు ఊపిరాడని సమయంలో ఎంకమ్మ 9:30 కు డాక్టర్ ఫాతిమా దగ్గరికి నడుచుకుంటూ పోయినదని, ఆమెను చూసి వెంటనే ఆక్సిజన్ పెట్టాలని డాక్టర్ కింది వారికి సిఫారసు చేశారు. కానీ ఎవరు కూడా ఆక్సిజన్ పెట్టలేదు. ఆమెకి సీరియస్ కావడంతో ఎంకమ్మ కొడుకు డాక్టర్ ఫాతిమా దగ్గరకు పోయి చెప్పగా ఆమె దగ్గరుండి ఆక్సిజన్ పెట్టించింది. ఆక్సిజన్ పెట్టిన 15 నిమిషాలనే ఎంకమ్మ శ్వాస ఆడక హాస్పిటల్లో చనిపోయినది.
ఆమె చనిపోవటానికి ముఖ్య కారణం డాక్టర్ అని, డ్యూటీలో ఉండి కూడా వెంకమ్మను నిర్లక్ష్యం చేయటం వలన ఆమె చనిపోయిందన్నారు. . డాక్టర్ నిర్లక్ష్యం వలన ఎంకమ్మ చావుకు కారకులైన డాక్టర్ల ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రి లేని ఒంటరివాడైన ప్రదీప్ ను ప్రభుత్వ పరంగా ఆదుకొని అతనికి చదువులు చెప్పించాలని వారు డిమాండ్ చేసినారు.
ప్రదీప్ ఉండటానికి ఇల్లు లేనందున అతనికి వెంటనే ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ చేసి ప్రభుత్వ అధికారులు దగ్గర ఉండి నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేసినారు. ఈ ధర్నాలో మహిళా సమైక్య నియోజకవర్గ అధ్యక్షురాలు దాసర్ల దుర్గమ్మ, వెంకన్న, రాము , సోమయ్య, ఎల్లమ్మ, బుజ్జి, కవిత, ఏసు, కొండలు , రాంబాబు తదితరులు ఉన్నారు.
MOST READ :
-
TG News : గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
-
New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!
-
Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!
-
Gold Price : మరోసారి గోల్డ్ ధర ఢమాల్.. ఒక్కరోజే భారీగా తగ్గిన ధర..!









