తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

రాజకీయాలకతీతంగా నీలగిరి నగరాభివృద్ధికి కృషి.. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి..!

ఎన్నికల అప్పుడే ఎవరి రాజకీయాలు వారివి ఎన్నికలు అయిపోయినందున నల్లగొండ నగరాన్ని రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

రాజకీయాలకతీతంగా నీలగిరి నగరాభివృద్ధికి కృషి.. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి..!

నల్లగొండ, మన సాక్షి :

ఎన్నికల అప్పుడే ఎవరి రాజకీయాలు వారివి ఎన్నికలు అయిపోయినందున నల్లగొండ నగరాన్ని రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కార్పొరేషన్ లో జరిగిన మొదటి కార్పొరేషన్ సాధారణ సమావేశంలో ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు.నగరంలోని అన్ని డివిజన్లో సమస్యలకు పరిష్కారం చూపి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిద్దామని స్పష్టం చేశారు.

కార్పొరేటర్లందరినీ సమావేశంలో పరిచయం చేశారు. కార్పొరేటర్లు తమ తమ డివిజన్లో ఉన్న సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. పలు డివిజన్లో డ్రైనేజీ రోడ్డు సమస్య ఉందని త్వరగా పనులు పూర్తి అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఆయా డివిజన్లో వారానికి ఒకసారి చెత్త డాక్టర్ ట్రాక్టర్లు వస్తున్నాయని దాంతో చెత్త కుప్పలు పేరుకు పోతున్నాయని మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని పెద్ద డివిజన్లఉన్నందున ఎక్కువ సిబ్బందిని కేటాయించాలని కోరారు.వీధి దీపాలు కొన్ని చోట్ల వెలగడం లేదని కొత్త లైట్లు తెప్పించి వేయాలని మేయర్ ను అభ్యర్థించారు.

రాబోయే వేసవికాలంలో నగరంలో నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్పొరేటర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు మేయర్ సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు.అనంతరం మేయర్ మాట్లాడుతూ ఆయా డివిజన్లో పనులు వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు సిబ్బందితో మాట్లాడి చెత్త సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చాక అన్ని పనులు పూర్తి చేయిస్తున్నామని రానున్న రోజుల్లో 24 గంటల పాటు త్రాగునీటిని అందించడం జరుగుతుందన్నారు.డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మైనార్టీ కార్పొరేషన్లకు ఎజెండాను ఉర్దూలో ప్రింట్ చేసి ఇవ్వాలని కోరారు. అంతకుముందు కార్పొరేటర్లందరూ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర కార్పొరేటర్లు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు