Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుతెలంగాణ

TG News : పవర్ లిఫ్టింగ్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్.. మన ఆదివాసి బిడ్డ..!

TG News : పవర్ లిఫ్టింగ్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్.. మన ఆదివాసి బిడ్డ..!

మన సాక్షి, హైదరాబాద్:

ప్రతిభకు పేదరికం అడ్డు రాదని నిరూపించాడు మన ఆదివాసి బిడ్డ. ప్రపంచ ఛాంపియన్ నిలిచి అందరి మన్ననలు పొందుతున్నాడు. రోజుకూలీ ఇంట్లో పుట్టినా పట్టుదలతో ప్రపంచ విజేతగా మోడెం వంశీ ఇండియా కీర్తిని మరింత పెంచారు.

పవర్ లిఫ్టింగ్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్ గా మన ఆదివాసీ బిడ్డ నిలిచారు. ఏజెన్సీ మారుమూల ఇప్పగూడెంలో పుట్టి ఇప్పుడు ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పవర్ లిఫ్టర్ మోడెం వంశీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

మాల్టాలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్ తరపున సాధించిన బంగారు పతకం, ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో తాను సాధించిన బంగారు పతకాలను వంశీ చూపించగా, ముఖ్యమంత్రి అభినందించారు.

ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపిస్తూ, రోజుకూలీ ఇంట్లో పుట్టినా పట్టుదలతో ఈరోజు ప్రపంచ విజేతగా మోడెం వంశీ ఇండియా కీర్తిని మరింత పెంచారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రశంసించారు.

మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, పలువురు నేతలు కూడా ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు