Breaking NewsTOP STORIESఉద్యోగంజిల్లా వార్తలువికారాబాద్ జిల్లా

పుస్తకాలతో కుస్తీ.. ఉద్యోగంతో దోస్తీ..!

పుస్తకాలతో కుస్తీ.. ఉద్యోగంతో దోస్తీ..!

కుల్కచర్ల, మన సాక్షి:

నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టి ఉద్యోగంతో దోస్తీ కట్టిన వికారబాద్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని పెద్ద వార్వల్ గ్రామానికి చెందిన శివాని రాములు సత్యమ్మ దంపతులకు జన్మించిన శివాని ఆనంద్ కుమార్ ఇటీవల విడుదలైన గ్రూప్-4 ఉద్యోగం సాధించడం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామస్తులు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ…. మట్టిలో మాణిక్యంగా చదువులో ఆణిముత్యంగా ఎదిగిన ఆనంద్ కుమార్ ను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు గ్రామస్తులు ఎంతగానో ప్రశంసించి అభినందించడం జరిగింది.

చిన్నతనం నుండి పెద్దల తో గౌరవంగా మేలిగి మిత్రులతో స్నేహంగా కలిగి ఉండి చి చిన్నారులతో ఆప్యాయంగా పలకరించి నిరంతరం విద్యార్థిగా ఉండి ఉద్యోగం సంపాదించడం జరిగింది.

ఇలాంటి మరెన్నో ఉద్యోగాలు సాధించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు గ్రామస్తులు తెలియజేయడం జరిగింది.

MOST READ :

మరిన్ని వార్తలు