సీఎం రాక సందర్భంగా యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

సీఎం రాక సందర్భంగా యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

డిసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అరెస్టు

దామరచర్ల , మనసాక్షి : నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో గల యాదాద్రి ధర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు.

పవర్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని హామీలు ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. దీంతో శంకర్ నాయక్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. సీఎం గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.