YOGA : శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆరోగ్యానికి యోగ అంతే..!
YOGA : శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆరోగ్యానికి యోగ అంతే..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆరోగ్యానికి యోగ అంతే ముఖ్యమని ఆర్డిఓ రామచందర్రావు, ఎంఈఓ బాలాజీ లు అన్నారు. సీఎం కప్ ఆటల పోటీలలో భాగంగా మంగళవారం రెండవ రోజు యోగ,కిక్ బాక్సింగ్,జూడో మరియు బ్యాడ్మింటన్ పోటీలను స్థానిక సిటిజన్స్ క్లబ్ ఆవరణలో ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కు యోగాలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందన్నారు.యోగా వలన మానసికంగా ఆత్మవిశ్వాసము కలిగి ఉంటారన్నారు. దీనిని సాధన చేయటం వలన ఏకాగ్రత అనేటటువంటిది పెంపొందించబడుతుందన్నారు. ప్రతి విద్యార్థి యోగాసనాలలో పాల్గొని చదువుపై కూడా ఏకాగ్రతను పెంచుకోవాలన్నారు. ప్రతిరోజు మీ మీ ఇళ్లలో కూడా యోగను సాధన చేయాలని వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో యోగ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, ప్రవీణ్ కుమార్, సురేష్, రిటైర్డ్ పిఈటి నర్సింలు, నానక్ రాం, వ్యాయామ ఉపాధ్యాయులు, వెంకటప్ప, రత్నయ్య, వెంకటేష్,సాయినాథ్, కతలప్ప, రాజశేఖర్, పారిజాత, రవికుమార్, రామకృష్ణ రెడ్డి, రాధిక, కృష్ణవేణి, రూప, రాజేశ్వరి, మీనా కుమారి, బసంత్ రెడ్డి బాలరాజ్ విద్యాసాగర్, రాజేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.
MOST READ :
-
PrajaPalana : ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, రూ.500 వంటగ్యాస్.. మళ్లీ ప్రజా పాలన దరఖాస్తులకు అవకాశం..!
-
District collector : డిసెంబర్ 25 లోపు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
TG News : ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. రైతు భరోసా పై సీఎం రేవంత్ ఆదేశాలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీలింగ్.. వారికి మాత్రమే.. లేటెస్ట్ అప్డేట్..!









