TOP STORIESBreaking Newsజాతీయం

UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

సైబర్ నేరగాళ్లు పెరిగిపోయారు. సైబర్ మోసాలు అంతుచిక్కడం లేదు. పోలీస్ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు సరికొత్త రీతిలో మోసాల పాల్పడుతున్నారు. తమిళనాడు పోలీసులు ఒక కొత్త స్కాం ని కనుగొని దానిని ప్రజలకు హెచ్చరించారు.

ఫోన్ పే, గూగుల్ పే వాడేవారు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే క్షణాల్లోనే ఎకౌంట్ ఖాళీ చేస్తారని హెచ్చరించారు. యూపీఐ (UPI) ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ స్కామ్ చాలా ప్రత్యేకమైనది. దీంతో నేరస్తులు మీ ఖాతాలలోని డబ్బు మొత్తం క్షణాల్లో ఖాళీ చేస్తారు. అదేంటంటే..

జంప్డ్ డిపాజిట్ స్కామ్ :

మీ ఫోన్ పే, గూగుల్ పే స్కామర్లు లక్ష్యంగా చేసుకుంటారు. బ్యాంకు ఖాతాలో కొద్ది మొత్తాన్ని జమ చేస్తారు. దీని తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడానికి తరచుగా నోటిఫికేషన్లు పంపుతుంటారు. వినియోగదారులు పిన్ (PIN) ఎంటర్ చేసినప్పుడు సైబర్ నేరస్తుల ఉచ్చులో పడతారు. దాంతో బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది.

జంప్డ్ డిపాజిట్ స్కాం గురించి ఎన్ పీ సీఐ (NPCI) ఏం చెబుతోంది :

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జంప్ డిపాజిట్ స్కాం గురించి.. యూపీఐ వినియోగదారులు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి లేదా లావాదేవీలు చేయడానికి కానీ వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లించుకోవచ్చునని చెప్పింది. యూపీఐ క్లిక్ చేసిన తర్వాత పిన్ నెంబర్ నమోదు చేయాలి కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది.

సైబర్ నేరగాళ్లు ఏం చేస్తారు :

సైబర్ నేరగాళ్లు మీ ఖాతాకు ఎంతో కొంత డబ్బులు పంపిస్తారు. పొరపాటున మీ బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ అయ్యాయని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఫోన్, ఈమెయిల్, యూపీఐ ద్వారా మెసేజ్ చేసి డబ్బు తిరిగి పంపాలని అడుగుతారు. ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ లు వస్తే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నీ ఖాతా ఖాళీ చేస్తారు.

జాగ్రత్తలు :

  • మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ ఎల్లప్పుడు సురక్షితమైన వైఫై కనెక్షన్ కనెక్ట్ చేయండి.

  • రెస్టారెంట్లు, మాల్స్ థియేటర్లలో ఏర్పాటు చేసిన పబ్లిక్ వైఫై ద్వారా డిజిటల్ డబ్బులు పంపొద్దు.

  • ఇంకా ఎవరికైనా డబ్బు పంపే ముందు వారి పేరు యూపీఐ ఐడిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.

  • భద్రత కోసం మీ యూపీఐ పిన్ క్రమం తప్పకుండా మార్చండి.

  • యూపీఐ ఖాతాకు సంబంధించి ఏదైనా మోసం జరిగినట్లు గమనిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించండి.

  • స్కామ్ జరిగితే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ని సంప్రదించి ఫిర్యాదు చేయండి.

SIMILAR NEWS : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
  2. UPI : యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే కొత్త రూల్స్ నేటి నుంచే.. తెలుసుకోండి..!
  3. Transaction : రూ.20 వేలకు మించి లావాదేవీలు చేస్తే.. ఫైన్ కట్టాల్సిందే.. బిగ్ అలర్ట్..!
  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల పరిమితి ఎంత.. పెంచుకోవచ్చా.. తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు