Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తులు చేసుకోవాలా.. మీరు అర్హులేనా..!
Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తులు చేసుకోవాలా.. మీరు అర్హులేనా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందజేయాలని నిర్ణయించింది. జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా రైతు భరోసా పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉందా..? లేదా..? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా ముఖ్యమంత్రి రైతు భరోసా పథకంపై దరఖాస్తుల గురించి ఎలాంటి సమాచారం తెలియజేయకపోవడం వల్ల దరఖాస్తు చేసుకునే అవసరం లేదని తేలింది.
అంతేకాకుండా రైతు భరోసా పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా తెలియజేశారు. రహదారులు, రియల్ ఎస్టేట్ భూములు, పరిశ్రమలకు, కేటాయించిన భూములు, రాళ్లు, రప్పలు, గుట్టలు, చెట్లు ఉన్న భూములకు తప్ప వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు.
MOST READ :
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే.. మీరు అర్హులేనా..!
-
Holidays : సంక్రాంతి సెలవుల్లో మార్పులు.. ప్రకటించిన విద్యాశాఖ..!
-
Rythu Bharosa : రైతు భరోసా ఎకరానికి రూ.12 వేలే.. వారికి కట్, ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు నిబంధనలు ఖరారు.. దరఖాస్తు ఎలా.. ఎక్కడ చేసుకోవాలి..!









