District collector : యువతకి చాలా భవిష్యత్తు ఉంది.. మత్తుకు బానిస కావొద్దు.. జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి..!
District collector : యువతకి చాలా భవిష్యత్తు ఉంది.. మత్తుకు బానిస కావొద్దు.. జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి..!
సూర్యాపేట, మనసాక్షి :
యువత కి చాలా భవిష్యత్ ఉందని మత్తు ముందుకు బానిస అవ్వొద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ నందు నార్కోటిక్ కో ఆర్డినేషన్ సెంటర్ (యన్ సి ఓ ఆర్ డి -ఎన్ కార్డు) పై జిల్లా ఎస్పి నరసింహ తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను విద్యాసంస్థలు ఎక్కువ ఉన్న సూర్యాపేట,కోదాడ లో యువత కి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అనుమానం ఉన్న ప్రదేశాలలో సి సి కెమెరా లు, లైట్స్, పెట్రోలింగ్ జరపాలని తెలిపారు. డ్రగ్స్ నుండి బయట పడేందుకు డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు కి ప్రతిపాదనలు పంపటం జరిగిందని తెలిపారు. ఇండస్ట్రీయల్ ఉన్న ప్రదేశాలలో వేరే రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికుల ఉన్న చోట కమ్యూనిటీ మీటింగ్ లు నిర్వహించాలని అధికారులకి సూచించారు.
విద్యా శాఖ, పోలీస్ శాఖ వారు యువత డ్రగ్స్ నుండి దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు అమలు చేయాలని అలాగే జిల్లా యువత చేడు వ్యసనాలకి, డ్రగ్స్ కి బానిస అవ్వకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జిల్లా ఎస్పి నరసింహ మాట్లాడుతూ 2024 లో 139 మందిని, 2025 లో 23 మందిని గంజాయి తరలిస్తుండగా అరెస్ట్ చేయటం జరిగిందని గంజాయి మహమ్మారీ నేడు గ్రామాలకి విస్తరించి యువత చేడుపోతున్నారని, చివరికి చిన్న పిల్లలకి చాక్లేట్ రూపంలో మత్తు పదార్థలు అలవాటు చేస్తున్నారని అన్నారు.
జిల్లాలో ప్రహరీ క్లబ్స్, ఆంటీ డ్రగ్స్ కమిటీ లు డ్రగ్స్ నుండి జిల్లాకి విముక్తి కల్పించేందుకు కృషి చేయాలని తెలిపారు.ప్రతి బుధవారం అధికారులు డ్రగ్ ని నిర్ములన కి సంబందించిన పోస్ట్ లను వాట్సాప్ స్టేటస్, డిపి లుగా పెట్టుకోవాలని తెలిపారు. తదుపరి తెలంగాణ ఆంటీ నార్కోటిక్ బ్యూరో వారిచే రూపొందిన పోస్టర్ ని కలెక్టర్ విడుదల చేశారు.
ఈ సమావేశం లో ఆంటీ నార్కోటిక్ డ్రగ్స్ డి ఎస్ పి బిక్షపతి రావు, డి టి ఓ సురేష్ కుమార్,డి ఈ ఓ అశోక్, డి ఐ ఈ ఓ భాను నాయక్,డ్రగ్స్ ఇన్స్ పెక్టర్ సురేందర్,సూపరిటీడెంట్ శ్రీనివాస రాజు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల యాక్షన్ ప్లాన్.. జిల్లా కలెక్టర్ సమావేశం..!
-
Leopard : వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత.. ప్రాణాలతో కాపాడేందుకు అధికారుల ప్రయత్నం..!
-
Miryalaguda : రైతుపై దాడి చేసిన రైస్ మిల్లర్లు.. ఆసుపత్రిలో రైతును పరామర్శించిన ఎమ్మెల్యే..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్.. మొదటి బిల్లు చెక్కుల పంపిణీ షురూ..!









