తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

Railway Track : తెలంగాణలో రైలు పట్టాలపై కారుతో యువతి హల్చల్.. (వీడియో)

Railway Track : తెలంగాణలో రైలు పట్టాలపై కారుతో యువతి హల్చల్.. (వీడియో)

 

శంకర్‌పల్లి, (మన సాక్షి):

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఉదయం 7 గంటలకు రైల్వే గేట్ క్రాసింగ్ మీదుగా పట్టాలు ఎక్కిన కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది.

వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంకర్‌పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామ శివారులో లక్నోకు చెందిన ఓ యువతి రెచ్చిపోయింది. నార్సింగ్ కు చెందిన రవికాసోని సాఫ్ట్ వేర్ ఉద్యోగి. నార్సింగ్ నుండి కొండకల్ వైపు వచ్చి రైల్వే ట్రాక్ పై అత్యంత ప్రమాదకరంగా కారు ఏడు కిలోమీటర్లు నడిపింది.

కొండకల్ నుంచి శంకర్‌పల్లి వరకు పట్టాలపై కారు వెళ్లడం చూసిన స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది ఆపాలని చెప్పినా ఆమె వినకుండా డ్రైవింగ్ చేసింది. కారును అడ్డగించిన స్థానికులను యువతి చాకుతో బెదిరించి గట్టిగా అరుస్తూ కేకలు వేసింది.

యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. పట్టాలపై కారును గమనించి లోకో పైలట్ రైలు ఆపేశాడు. కారు కంట్రోల్ తప్పి ఓ మూలమలుపు వద్ద ఆగిపోయి ముందుకు కదలలేదు. రైల్వే గ్యాంగ్ మెన్లు, రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని కారులో నుండి బయటకు తీశారు.

కారు ముందు వెనక అద్దాలు పగిలిపోయాయి. చివరికి ఎలాగోలా కష్టపడి పోలీసులు, స్థానికులు కారు ఆపివేయించారు. అయితే మద్యం మత్తులోన లేక, గంజాయి మత్తులోన యువతి అలా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వికారాబాద్ రైల్వే పోలీసులు యువతిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Video : 

https://twitter.com/ManaSakshiNews/status/1938106069911482381?t=G0g0X2cqOmgjjX4BNGn8FQ&s=19

MOST READ : 

  1. District collector : డ్రగ్స్ కు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ వినూత్న ప్రచారం..!

  2. TG News : స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. అప్పటి లోగా నిర్వహించాలని ఆదేశాలు..!

  3. District collector : రైతు భరోసా సంబరాలకు నల్గొండ జిల్లా రైతులు.. జెండా ఊపిన జిల్లా కలెక్టర్..!

  4. Students : ఇంటర్ చదివే విద్యార్థులు.. లక్షల రూపాయలు వారికి ఎక్కడివి.. కట్ చేస్తే పోలీసుల అదుపులో..!

మరిన్ని వార్తలు