State Level : స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జడ్పీ హైస్కూల్ విద్యార్థి..!

State Level : స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జడ్పీ హైస్కూల్ విద్యార్థి..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా గురువారం తిరుపతి ఎస్ వి యూనివర్సిటీ క్రీడా మైదానంలో ఉమ్మడి పోటీలు నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఎంపికలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెంబకూరు విద్యార్థి జె. తరుణ్ కుమార్ రాజు అద్భుతమైన ఆటతీరుతో కనబబరిచి అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
తిరుపతి ఎస్వి క్రీడామైదానం లో జరిగిన అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి అండర్ 17 అథ్లెటిక్స్ కు ఎంపికైనట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజు తెలియజేసారు. పి డి దిలీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి జె. తరుణ్ ఈ నెలలో పల్నాడు జిల్లా వినుకొండ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అథ్లెటిక్స్ కు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు.
అండర్ 17పోటీలకు ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. రమేష్ బాబు, పి డి దిలీప్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లి, దండ్రులు, ప్రజలు అభినందనలు తెలిపారు. హెచ్ ఎం రమేష్ బాబు మాట్లాడుతూ తరుణ్ కుమార్ రాజు రాష్ట్ర స్థాయి పోటీలో విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు తల్లి దండ్రులకు మండలానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.
MOST READ :
-
ACB : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ..!
-
Hyderabad : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఆటో డ్రైవర్.. పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య..!
-
LPG GAS : ఈకేవైసీ చేయకుంటే గ్యాస్ సబ్సిడీలు వర్తించవు.. ఇలా చేసుకోవాలి..!
-
Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!









