Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Hyderabad : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఆటో డ్రైవర్.. పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య..!

Hyderabad : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఆటో డ్రైవర్.. పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య..!

మేడ్చల్ మల్కాజిగిరి, మన సాక్షి :

హైదరాబాదులోని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడి మరణించిన ఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకోవడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి భగత్ నగర్, జమ్మిగడ్డ జవహర్ నగర్‌కు చెందిన సింగిరెడ్డి మీన్ రెడ్డి (32) అద్దె ఆటో నడుపుతూ జీవనోపాధి సాగించేవాడు. మంగళవారం రాత్రి రాధికా ఎక్స్ రోడ్ వద్ద కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ డ్రైవ్ లో మద్యం సేవించి వాహనం నడిపినట్టుగా గుర్తించారు.

దీంతో అతను నడుపుతున్న ఆటోను సీజ్ చేసి, నీ తరపున మద్యం సేవించని వ్యక్తి వస్తే ఆటో అప్పగిస్తాం” అని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన మీన్ రెడ్డి రాత్రి సుమారు 10.20 గంటల సమయంలో ట్రాఫిక్ స్టేషన్ దగ్గరే పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. దీనిని గమనించిన పక్కవారు, పోలీసులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు. మద్యపాన అలవాటు, ఆర్థిక ఇబ్బందులు కారణం మీన్ రెడ్డి దీర్ఘకాలంగా మద్యానికి బానిసై ఉందని, అద్దెకు తీసుకున్న ఆటోను పోలీసులు సీజ్ చేయడంతో యజమాని అడుగుతాడేమోనన్న భయంతో మనోవేదనకు గురై ఆత్మాహుతికి పాల్పడినట్లు సిఐ తెలిపారు.

MOST READ : 

  1. LPG GAS : ఈకేవైసీ చేయకుంటే గ్యాస్ సబ్సిడీలు వర్తించవు.. ఇలా చేసుకోవాలి..!

  2. BREAKING : కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి..!

  3. Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!

  4. Komatireddy Rajagopal Reddy : సొంత డబ్బు రూ.12.50 లక్షలతో పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..!

మరిన్ని వార్తలు