తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : కొత్తగా 15 వేల రేషన్ కార్డులు.. రాని వారికి మళ్లీ ధరఖాస్తుకు అవకాశం..!

Miryalaguda : కొత్తగా 15 వేల రేషన్ కార్డులు.. రాని వారికి మళ్లీ ధరఖాస్తుకు అవకాశం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నల్గొండ జిల్లా, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో నూతన ఆహార భద్రత కార్డులు( రేషన్ కార్డులు) మంజూరైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వీటన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కొత్తగా సుమారు 15 వేల రేషన్ కార్డులు వచ్చాయని తెలిపారు. రేషన్ కార్డులు రానివారు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వం వెంటనే వారి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని తెలిపారు.

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందజేస్తున్నదని, అంతేకాక సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నదని, ఎక్కడైనా రేషన్ బియ్యం పక్కదారి పడితే సంబంధితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ల వంటివి ఆత్మగౌరవం పెంచే కార్యక్రమాలని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇక్కడి ప్రజలు ఎంతో చైతన్యవంతులని, ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ ఇక్కడ నుండే జరగడం సంతోషమని చెప్పారు. రేషన్ కార్డులలో పేర్లు నమోదు కాని వారు నమోదు చేయించుకోవాలని, అది ప్రజల హక్కు అని అన్నారు. అదే సమయంలో ఎవరైనా చనిపోయిన లేదా రేషన్ కార్డులలో పేర్లు తప్పుగా నమోధై ఉంటే స్వచ్చందంగా వారి పేర్లు తీసివేయించాలని కోరారు.

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడారు. కాగా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు 11691 కొత్త రేషన్ కార్డులు జారీ చేయగా, వీటితోపాటు 14 వేల 465 మంది సభ్యులను రేషన్ కార్డులలో చేర్చడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ని ఎరువుల షాపును ఆకస్మిఖంగా తనిఖీ చేసి ఎరువుల వివరాలను, స్టాక్ రిజిస్టర్ ను, ఆన్లైన్లో సారి పోల్చి చూశారు.

ఆ తర్వాత జిల్లా కలెక్టర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అప్ గ్రేడెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు భోజనం వడ్డించారు. అంతేగాక విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి భోజనం నాణ్యత పై ఆరా తీశారు. వంటగదిని, విద్యార్థులకు వడ్డించేందుకు వండిన వంటలను పరిశీలించారు .

జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, తహసిల్దార్ తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Nalgonda : నల్గొండ జిల్లాలో వెలుగులోకి మానవ అక్రమ రవాణా.. వెట్టి చాకిరి.. ముఠా అరెస్ట్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు.. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..!

  3. TG News : జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. సామాన్యులకు ఊరుట..!

  4. Nalgonda : ప్రభుత్వ ఉచిత పథకాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!         

  5. Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు