TOP STORIESBreaking Newsఉద్యోగంతెలంగాణ

TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!

TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను పటిష్టం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కంప్యూటర్ టీచర్లు ఐసిటి ఇన్స్ట్రక్టర్లు నియమించడానికి నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లున్న పాఠశాలలో 2837 ఉన్నాయి. అయితే ఆ కంప్యూటర్ ల్యాబ్లను పూర్తిగా ఉపయోగించుకోవడానికి విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు కంప్యూటర్ టీచర్లను నియమించనున్నారు.

అందుకు త్వరలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టి జి టి ఎస్) ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. కంప్యూటర్ టీచర్లకు ప్రభుత్వం గౌరవ వేతనంగా నెలకు పదిహేను వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ వేతనాన్ని సంవత్సరంలో 10 నెలల పాటు చెల్లిస్తారు. వారికిచ్చే వేతనాన్ని సమగ్ర శిక్ష నిధుల నుంచి వినియోగించనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 20 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 4200 కంప్యూటర్లు సమకూర్చారు.  అప్పట్లో ఐదు సంవత్సరాల కాలపరిమితికి కంప్యూటర్ ఇన్స్పెక్టర్లను నియమించారు. అయితే వారిని తొలగించిన తర్వాత కంప్యూటర్ ల్యాబ్ లు మొత్తం నిరుపయోగంగా ఉన్నాయి. విద్యార్థులకు డిజిటల్ విద్య అందించడానికి బోధకులు లేకుండా పోయారు.

అయితే విద్యాశాఖ ఇటీవల చేపట్టిన డిజిటల్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి గాను ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నారు. బెంగళూరుకు చెందిన ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి 1354 పాఠశాలల్లో అసిస్టెంట్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రాం అమలు చేస్తుంది.

అదేవిధంగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఆన్లై్‌లై  విధానంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు గణితం సైన్స్ పాఠాలు సులువుగా అర్థమయ్యేలా ఖాన్ అకాడమీ తరగతులను కూడా ప్రారంభించారు. ఆన్‌లైన్ అసిస్టెంట్ లెర్నింగ్ ప్రోగ్రాములు విజయవంతం కావాలంటే కంప్యూటర్లు సాఫ్ట్వేర్ పై పూర్తి అవగాహన ఉన్న బోధకులు తప్పనిసరిగా అవసరం ఉంది. ఈ కొత్త నియామకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య అందించనున్నారు.

MOST READ :

  1. Hyderabad : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఆటో డ్రైవర్.. పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య..!

  2. Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!

  3. Tasildar : చింతపల్లి మండల తహసిల్దార్ గా విజయలక్ష్మి.. ఎవరో తెలుసా..! 

  4. Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!

మరిన్ని వార్తలు