Srisailam : శ్రీశైలంకు 4.14 లక్షల క్యూసెక్కుల వరద.. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో.. Latest Update
Srisailam : శ్రీశైలంకు 4.14 లక్షల క్యూసెక్కుల వరద.. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో.. Latest Update
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
మహారాష్ట్ర , కర్ణాటక ప్రాంతాలతో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉప్పొంగుతుంది. శ్రీశైలం జలాశయానికి వరద భారీగా చేరుతుంది. కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల తో పాటు తుంగభద్ర నుంచి భారీగా శ్రీశైలం కు వరద నీరు చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం గంట గంటకు పెరుగుతుంది. జూరాల ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాగా జూరాల ప్రాజెక్టు నుంచి 41 గేట్లు ఎత్తి 2 లక్షల 90 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి, తుంగభద్ర నుంచి 4.14 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో శ్రీశైలం జలాశ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులకు గాను 866.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 127.6 టీఎంసీలకు చేరింది.
నాగార్జునసాగర్ ఇన్ ఫ్లో :
నాగార్జునసాగర్ జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదలైన నీరు నాగర్జున సాగర్ జలాశయానికి చేరుతుంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 509 అడుగుల నీరుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 590 అడుగులకు గాను 509 అడుగులకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 52,471 వేల క్యూసెక్కులు మీరు వస్తుంది.
ALSO READ :
రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!
Komatireddy, Hareeshrao : కోమటిరెడ్డిని హరీష్ రావు అంత మాట అనేశాడా.. అయితే ఆయన రియాక్షన్ ఏంటి..!









