Nagarjunasagar : సాగర్ కు 5.24 లక్షల క్యూసెక్కుల వరద.. గేట్లు ఎత్తేందుకు టైం ఫిక్స్.. Latest Update
Nagarjunasagar : సాగర్ కు 5.24 లక్షల క్యూసెక్కుల వరద.. గేట్లు ఎత్తేందుకు టైం ఫిక్స్.. Latest Update
మనసాక్షి, తెలంగాణ బ్యూరో :
కృష్ణ నది ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానది పరవళ్ళు తొక్కుతోంది. నాగార్జునసాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ గేట్లు తెర్చుకున్నాయి. సాగర్ వైపు కృష్ణమ్మ బిర బబరా కదులుతోంది. నాగార్జునసాగర్ జలాశయం కూడా నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు తేదీ ఖరారు చేశారు.
శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టు నుంచి 4,24,466 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు 5.24 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 880 అడుగులుగా ఉంది.
నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 5.24 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 34 వేల క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో కొనసాగుతుంది. సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 270 టీఎంసీల నీరు ఉన్నది.
590 అడుగుల నీటిమట్టం గాను 575 అడుగుల నీటిమట్టం చేరింది. గంట గంటకు సాగర్ జలాశ నీటిమట్టం పెరుగుతుండడంతో రేపు (సోమవారం) మధ్యాహ్నం వరకు సాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. అందుకుగాను సోమవారం ఉదయం 8 గంటలకు గేట్లు ఎత్తేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. సాగర్ గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
Viral video : బైక్ పై వెళ్తూనే ఇదేం పాడు పని.. రెచ్చిపోయిన ప్రేమ జంట.. (వైరల్ వీడియో)









