TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్

Electricity Bill : విద్యుత్ బిల్లులో 50 శాతం రాయితీ.. అస్సలు మిస్ కావద్దు..!

Electricity Bill : విద్యుత్ బిల్లులో 50 శాతం రాయితీ.. అస్సలు మిస్ కావద్దు..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

గృహ విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APCPDCL) ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని ఒక ప్రకటనలో కోరింది. అధిక విద్యుత్తు లోడును క్రమబద్ధీకరించేందుకు ఈ అవకాశం కల్పించింది.

దీని ద్వారా వినియోగదారులు వారి విద్యుత్ బిల్లులను నియంత్రించుకోవచ్చును. విద్యుత్ బిల్లులు అధికంగా వస్తుందని దానిని క్రమబద్ధీకరించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చునని APCPSCL ఒక ప్రకటనలో పేర్కొన్నది.

ఈ ఆఫర్ కింద అదనపు విద్యుత్ లోడ్ ను క్రమబద్ధీకరించే వినియోగదారులకు ఒక కిలోవాటుకు 50% రాయితీ అందించబడుతుంది. ఈ ఆఫర్ ను వినియోగించుకోవడానికి జూన్ 30, 2025 వరకు మాత్రమే ఈ అవకాశం ఉంది. గడువులోగా దరఖాస్తు చేసుకొని సంబంధిత చెల్లించిన దారులకు 50% రాయితీ వర్తిస్తుంది. వినియోగదారులు ఈ ఆఫర్లు పొందేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా, లేదా ఏపీ సీపీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

అధిక విద్యుత్ వినియోగం ఉన్న గృహాల వినియోగదారులకు ఈ ఆఫర్ ఒక వరం లా ఉంది. అధిక లోడ్ క్రమబద్ధీకరించడం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడమే కాకుండా విద్యుత్ సరఫరా వ్యవస్థలో కూడా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

MOST READ : 

  1. Nalgonda : నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స..!

  2. Teacher : ఉపాధ్యాయులకే ఆమె ఆదర్శం.. ఎందుకో, ఏంటో.. తెలుసుకోవాల్సిందే..!

  3. TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు..!

  4. Students : ఇంటర్ చదివే విద్యార్థులు.. లక్షల రూపాయలు వారికి ఎక్కడివి.. కట్ చేస్తే పోలీసుల అదుపులో..!

  5. Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు