Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : పెద్దగట్టు జాతరకు 60 ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి..!

Suryapet : పెద్దగట్టు జాతరకు 60 ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి..!

సూర్యాపేట, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్రంలో రెండేండ్లకు ఒకసారి జరిగే రెండవ అతిపెద్ద జాతరైన దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి వారి జాతరకు భక్తుల సౌకర్యార్థం సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 16న తెల్లవారుజామున ప్రారంభమై ఈ నెల 20 వరకు జాతర కొనసాగనుందని తెలిపారు.

లింగమంతుల స్వామి వారి జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు.భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ జాతరకు సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు.సూర్యాపేట నుండి పెద్దగట్టు జాతరకు బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20 అని తెలిపారు.

జాతరకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి భక్తులను సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు.ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖవంతమని అన్నారు.

MOST READ : 

  1. Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

  2. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. District collector : బేటి బచావో – బేటి పడావో ప్రచార రతాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు