Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : బేటి బచావో – బేటి పడావో ప్రచార రతాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

District collector : బేటి బచావో – బేటి పడావో ప్రచార రతాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో భేటీ బచావో – బేటి పడావో ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ప్రారంభించారు.

కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, లింగ సమానత్వం, బాలిక విద్య పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. మహిళా శిశు సంక్షేమ అధికారి జయ మాట్లాడుతూ భేటీ బచావో బేటి పడావో పథకం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో బాలికల సంక్షేమానికి బాలికల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు గ్రామస్థాయిలో ప్రచారం చేయడానికి సంస్కృతిక కళాకారులచే నాటికలు, చైతన్య గీతాలతో ప్రచారం చేయనున్నట్లు ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిడిపిఓ వెంకటమ్మ సూపర్వైజర్ శ్రీలత డిసిపిఓ తిరుపతయ్య సఖి సెంటర్ అడ్మిన్ క్రాంతి రేఖ, జెండర్ స్పెషలిస్టులు అనిత, నర్సింలు, కవిత, జనరంజని కల్చరల్ అసోసియేషన్ కళాకారులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Hyderabad : మైక్రోసాఫ్ట్ విస్తరణ.. నూతన క్యాంపస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  2. UPI : ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్.. ఫిబ్రవరి 15 నుంచి కొత్త రూల్స్..!

  3. Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!

  4. Gold Price : తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో కొనడం కష్టమే..!

మరిన్ని వార్తలు