Breaking Newsక్రైంజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

PDS : 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..!

PDS : 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..!

పెద్దపల్లి, సుల్తానాబాద్, మన సాక్షి :

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు. గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్ పక్క సమాచారంతో పెద్దపల్లి లోని బండారి కుంట, సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి గ్రామాల్లో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ మాట్లాడుతూ, సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి గ్రామంలో నిల్వ ఉన్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని , పెద్దపల్లి లోని బండారి కుంట వద్ద అక్రమంగా నిల్వ ఉన్న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తనిఖీల్లో పట్టుకోవడం జరిగిందని అన్నారు.

65 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటో ను సీజ్ చేయడం జరిగిందని అన్నారు. సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని ఎం.ఎల్.ఎస్ పాయింట్ కు తరలించామని, ఆటోను పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందని పౌరసరఫరాల అధికారి తెలిపారు.

వాహనం యజమాని, డ్రైవర్, అక్కడ పనిచేస్తున్న ఇతర లేబర్ పై తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ నియంత్రణ ఉత్తర్వులు 2016 ప్రకారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీలలో డిప్యూటీ తహసిల్దారులు రవీందర్, మహేష్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ సంబంధిత అధికారులు, తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పన్ను బకాయి చెల్లించకుంటే షాపింగ్ మాల్స్ సీజ్..!

  2. Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!

  3. UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!

  4. Groups : డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి..!

మరిన్ని వార్తలు