District Collector : ప్రజావాణికి 66 ఫిర్యాదులు.. సత్వరమే పరిష్కరించాలి..!
District Collector : ప్రజావాణికి 66 ఫిర్యాదులు.. సత్వరమే పరిష్కరించాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 66 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
అర్జీదారుల దరఖాస్తుల లో పేర్కొన్న సమస్యల పై క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 66 దరఖాస్తులు స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, ట్రైని కలెక్టర్ కొయ్యడ ప్రణయ్ కుమార్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
MOST READ ;
-
Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!
-
Rythu : ఆ రైతులకు డబుల్ బోనాంజా.. ఎకౌంట్లో రూ.20 వేలు..!
-
District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. అంబ భవాని ఎత్తిపోతల నిర్మాణ పనుల పరిశీలన..!
-
TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్..!
-
TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!









