Calendar : వైరల్ అవుతున్న 84 ఏళ్ల క్యాలెండర్.. డేటు, వారం సేమ్.. ఏం జరిగిందో తెలుసుకోండి..!
Calendar : వైరల్ అవుతున్న 84 ఏళ్ల క్యాలెండర్.. డేటు, వారం సేమ్.. ఏం జరిగిందో తెలుసుకోండి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఈ ఏడాది ప్రపంచంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. మహా కుంభమేళా తొక్కిసలాట, పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్, అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి సంఘటనలన్నింటికీ మధ్య 84 సంవత్సరాల గ్యాప్ ఉంది. అదేంటంటే తెలుసుకుందాం..
1941 సంవత్సరపు క్యాలెండర్ 2025 క్యాలెండర్ రెండు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటంటే 1941 క్యాలెండర్ తో యధావిధిగా 2025 క్యాలెండర్ కూడా ఉండడం ప్రధాన కారణం. తేదీలు, రోజులు కూడా అచ్చం అలాగే ఉన్నాయి. ఈ సంవత్సరం రోజు అంతా సరిగ్గా ఒకేలా ఉంది.
ఈ రెండు సంవత్సరాలు కూడా బుధవారంతో ప్రారంభమయ్యాయి. రెండు లీప్ ఇయర్ కాదు. ఈ రెండు సంవత్సరాలలో కూడా ప్రతి తేదీ, వారంలో ఒకేరోజు వస్తుంది. ఇదిలా ఉండగా 1941లో జరిగిన సంఘటనలతో ఈ ఏడాది పోలుస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
1941లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. జపాన్ అమెరికా పెర్ల్ హార్బర్ పై దాడి చేసింది. ప్రస్తుతం ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతుంది. భారతదేశ – పాకిస్తాన్ మధ్య కూడా దాడులు జరిగాయి.
ఇదిలా ఉండగా 1941లో మే 27న ఫ్రాన్స్ సమీపంలోని ఉత్తర అట్లాంటిక్ లో బ్రిటిష్ నావికాదళం జర్మన్ యుద్ధనౌక బిష్మార్కును ముంచేసింది. ఈ సంఘటనతో వేలాదిమంది సైనికులు చనిపోయారు. కాగా ఈ ఏడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో ముడిపెట్టారు. అదేవిధంగా 1941 జులై 26వ తేదీన అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్ వెల్డ్ ఫ్రెంచ్ ఇండో చైనా ను జపనీస్ ఆక్రమించినందుకు ప్రతికారంగా అమెరికాలోని అన్ని జపనీస్ ఆస్తులను జప్తు చేశారు.
1941 లోనే నాజీ జర్మనీ సోవియాట్ యూనియన్ పై దాడి చేస్తూ ఆపరేషన్ బర్బరోసాను ప్రారంభించింది. అమెరికాను యుద్ధంలోకి లాగింది. ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను గురైయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచం పూర్తిగా యుద్ధంలో మునిగిపోనున్నదేమో అని వైరల్ అవుతుంది.
2025లో రష్యా – ఉక్రెయిన్ సంఘర్షణలు, భారత్ పెహల్గామ ఉగ్రదాడి, భారత్ – పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ, గాజా, దక్షిణ లెబనాన్ లో పెద్ద ఎత్తున యుద్ధం, ఇజ్రాయిల్ – ఇరాన్ దాడులు జరుగుతున్నాయి.
దీంతో పాటు 2025 లో మహా కుంభమేళా తోకేసలాట, ఢిల్లీ తొక్కి సలట, గుజరాత్ బాణాసంచా కర్మగారంలో అగ్ని ప్రమాదం, పెహల్గామా దాడి, బెంగళూరులో ఆర్సిబి వేడుకల సందర్భంగా తొక్కిసలాట, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. దాంతో 1941 తో 2025 సంవత్సరాన్ని పోల్చుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
VIRAL NEWS :
-
Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)
-
Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)
-
Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)
-
Viral Video : భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. (వైరల్ వీడియో)
-
Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)









