Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIEStravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. ప్రయాణంలో 10% డిస్కౌంట్ అందించాలని నిర్ణయించింది. ఈ రాయితీ 2023 జూలై 2 తేదీ (ఆదివారం ) నుంచి అమలులోకి రానున్నది.

 

సుదూర ప్రాంతం వెళ్లే ప్రయాణికులకు సౌకర్యార్థంగా 10 శాతం రాయితీతో తెలంగాణ ఆర్టీసీ టికెట్లను అందజేయనున్నది. బెంగుళూరు, విజయవాడ రూట్లలో 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ రెండు మార్గాలలో ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీని ఇవ్వనున్నది. రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసులలో ఆదివారం నుంచి 10 శాతం రాయితీని అమలు చేయనున్నారు. ఈ రాయితీ సౌకర్యం ఆగస్టు 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

 

ALSO READ : 

1.TRAINS | నల్గొండ, మిర్యాలగూడలో ఇకపై ఆ.. రైళ్లు ఆగనున్నాయి..!

2. Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. మూడేళ్ల పాటు మరో కొత్త పథకం.. రూ. 3.6 లక్షల కోట్లు కేటాయింపు

3. TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?

4. Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!

 

విజయవాడ, బెంగళూరు రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఆలోచనలో రిజర్వేషన్ ఉన్న ప్రతి సర్వీసులో 10% రాయితీ టిఎస్ఆర్టీసి కల్పిస్తుంది. అంతే కాకుండా రాను.. పోను కూడా ఒకేసారి రిజర్వేషన్ బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో కూడా 10 శాతం రాయితీని అందజేయనున్నారు.

 

ఈ రాయితీ వల్ల విజయవాడ రూట్ లో 50 రూపాయల వరకు, బెంగళూరు రూట్ లో 100 రూపాయల వరకు ఒక్కొక్క ప్రయాణికుడికి ఆదా అవుతుంది. ఆగస్టు 15వ తేదీ వరకు 10 శాతం రాయితీ సదుపాయం అందుబాటులో ఉండటం వల్ల ప్రయాణికులు వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎండి వీసీ సజ్జనార్ కోరారు.

 

ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ tsrtconline.in సంప్రదించాలని వారు సూచించారు.

మరిన్ని వార్తలు