Project K : ప్రభాస్ ప్రాజెక్టు కె గ్లింప్స్ రిలీజ్.. హాలీవుడ్ రేంజ్ లో..! (వీడియో)
Project K : ప్రభాస్ ప్రాజెక్టు కె గ్లింప్స్ రిలీజ్.. హాలీవుడ్ రేంజ్ లో..! (వీడియో)
మనసాక్షి , సినిమా డిస్క్ :
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ – కె రివీల్ అయింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న టైం ట్రావెల్ సైన్స్ ఫిల్మ్ ప్రాజెక్ట్ – కె. గ్లింప్స్ ను కామిక్ ఖాన్ 2023 వేడుకల్లో విడుదల చేశారు. ఈ సినిమాకు టైటిల్ కల్కి 2898 ఏడి ( KALKI 2898 AD) అనే టైటిల్ ఖరారు చేశారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మిస్తున్నారు. దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా కమల్ హాసన్, అమితాబచ్చన్, దిశా పటాని కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో పురాణాల ప్రకారం కలియుగం అంతంలో విష్ణువు పదో అవతారమే కల్కి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి లా కల్కి ఉద్భవిస్తుందని పురాణ కథల్లో చెబుతారు. కలియుగం అంతంలో జరిగే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది.
ALSO READ :
1. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!
2. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?
3. SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!
4. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!
ఈ సినిమా భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. అందువల్ల దీనిని టైం ట్రావెల్ సైన్స్ లో తీస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో కల్కి గ్లింప్స్ ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తే హాలీవుడ్ లో ప్రభాస్ ఆగమనం ఖాయం కానున్నది.
తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ మాత్రం అదిరిపోయింది. ఫ్యాన్సును నాగ్ అశ్విన్ ఉత్సాహపరిచాడు. కల్కి క్రియేట్ ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా రచ్చ రచ్చగా ఉందని చెప్పవచ్చును. గ్లింమ్స్ లో విజువల్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ప్రభాస్ లుక్ అదిరిపోయింది. అమెరికాలో జరుగుతున్న “శాన్ డియాగో కామిక్ ” వేడుకల్లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ – కె రికార్డుకు ఎక్కింది.
Project – Kalki #Prabhas 🦁🔥 pic.twitter.com/BpUyAeNTUb
— Sᴀʟᴀᴀʀ Rᴀᴠɪ™ (@SalaarRavi) July 21, 2023










