ముగిసిన సీఎల్పీ సమావేశం.. అధిష్టానమే తుది నిర్ణయం, ఆయన వేపే మొగ్గు..!
ముగిసిన సీఎల్పీ సమావేశం.. అధిష్టానమే తుది నిర్ణయం, ఆయన వేపే మొగ్గు..!
హైదరాబాద్, మన సాక్షి :
తెలంగాణ సీఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ లీడర్ గా అధిష్టానందే తుది నిర్ణయం అంటూ ఏకవాక్య తీర్మానంతో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కాగా అధిష్టాన నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టగా తుమ్మల నాగేశ్వరరావు, ఇతర నాయకులు బలపరిచారు.
సిఎల్పీ లీడర్ గా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని నిర్ణయిస్తారా.? లేదా..? అనేది ఉత్కంఠ నెలకొన్నది. సోమవారం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు.
ALSO READ : సీనియర్ కాంగ్రెస్ నేతలతో డీకే భేటీ.. సీఎం , మంత్రులు వారే..!
సమావేశంలో సీఎల్పీ లీడర్ గా అధిష్టాన నిర్ణయానికి వదిలేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ పై పోరాటం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కింది. పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూప నున్నదా..? లేదా..? అనేది మరి కొద్ది సేపట్లో తెలియనున్నది.
ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎల్పీ సమావేశం ముగియడంతో ఈరోజు గవర్నర్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు రాజ్ భవన్ లో సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం కూడా ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
ALSO READ : రేవంత్ రెడ్డిది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. ఆయన రాజకీయం టిఆర్ఎస్ తోనే ప్రారంభం.. సోషల్ మీడియాలో వైరల్..!
గవర్నర్ నుంచి ఆహ్వానం :
తెలంగాణలో ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం అందనున్నది. ఆదివారం కాంగ్రెస్ నాయకులు గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా సోమవారం గవర్నర్ నుంచి పిలుపు అంజన వెంటనే ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేతలు వెళ్ళనున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు 60 స్థానాలు ఉంటే సరిపోతుంది. కాగా కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు ఉండడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు సులభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకు గవర్నర్ కూడా కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించనున్నది.
ALSO READ : తెలంగాణ కాంగ్రెస్ హస్తగతం..!









