తెలంగాణ కాంగ్రెస్ హస్తగతం..!

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా సాగింది. అధికారం హస్తగతమయింది. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ హస్తగతం..!

65 స్థానాలతో అధికారంలోకి

39 స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా సాగింది. అధికారం హస్తగతమయింది. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ విజయానికి చేరుకుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సిపిఐ తో కలిసి 65 స్థానాలను సాధించింది.

రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించారు. కాగా 60 స్థానాలు గెలుచుకుంటే మ్యాజిక్ ఫిగర్ తేల్చుకున్నట్టే. 60 స్థానాలు గెలుచుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలను సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలను సాధించగా బీఆర్ఎస్ 39, బిజెపి 8, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించింది.

ALSO READ : రేవంత్ రెడ్డిది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. ఆయన రాజకీయం టిఆర్ఎస్ తోనే ప్రారంభం.. సోషల్ మీడియాలో వైరల్..!

కాగా కాబోయే సీఎం రేవంత్ రెడ్డి, రెండు చోట్ల మాజీ సీఎం కేసీఆర్, బిజెపి నేత ఈటెల రాజేందర్ రెండుచోట్ల పోటీ చేశారు. కాగా కేసీఆర్ గజ్వేల్ లో విజయం సాధించగా కామారెడ్డిలో ఓటమిపాలయ్యారు. రేవంత్ రెడ్డి కొడంగల్ లో విజయం సాధించగా కామారెడ్డిలో ఓటమిపాలయ్యారు. బిజెపి నేత ఈటెల రాజేందర్ సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో, కెసిఆర్ పై పోటీ చేసిన గజ్వేల్ లో రెండు చోట్ల కూడా ఓడిపోయారు.

టిఆర్ఎస్ కు దీటుగా ప్రచారం:

అధికార బి ఆర్ ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో దీటుగా ప్రచారం చేసింది. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి విజయం సాధించారు. ఒకప్పుడు కేసీఆర్ స్పీచ్ కి ప్రజలు దాసోహం అనేవారు. కానీ ఇప్పుడు కెసిఆర్ స్పీచ్ లో ఏ మాత్రం ఉత్తేజితమైన వాతావరణం కల్పించకపోగా ఎప్పుడు ఒకేలా చెప్పిందే చెప్పడంతో కెసిఆర్ తో పాటు కేటీఆర్ స్పీచ్ లకు విసిగిపోయారు. రేవంత్ రెడ్డి స్పీచ్ తో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఆసక్తి చూపించారు.

ALSO READ : తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి రేపే ప్రమాణ స్వీకారం

గజ్వేల్ లో కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించారు. సిరిసిల్లలో కేటీఆర్ విజయం సాధించగా, సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి గెలుపొందారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు హుజూర్ నగర్, కోదాడలో విజయం సాధించగా నల్గొండ, మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపొందారు. నాగార్జునసాగర్ లో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి గెలుపొందారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి విజయం సాధించగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమిపాలయ్యారు.

ALSO READ : ప్రగతి భవన్ కాదు, ప్రజా భవన్.. ఆరుగ్యారెంటీలతో పాటు మరో హామీ.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!