Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

MallaReddy : కెసిఆర్ నుంచి మల్లారెడ్డికి కబురు.. భేటీ అయిన మల్లారెడ్డి..!

MallaReddy : కెసిఆర్ నుంచి మల్లారెడ్డికి కబురు.. భేటీ అయిన మల్లారెడ్డి..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నుంచి మేడ్చల్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి మల్లారెడ్డికి కబురు వచ్చింది. మల్లారెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ మారతారని ప్రచారం సాగుతుంది. ఇటీవల ఆయనతోపాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో భేటీ అయ్యారు. దాంతో కెసిఆర్ మల్లారెడ్డికి కబురు పంపినట్లు సమాచారం. పార్టీ మారతారు అనే ప్రచారం జోరుగా సాగడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది.

దాంతో మల్లారెడ్డి శుక్రవారం నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలో ఆయన కుమారుడు భద్రారెడ్డి తో కలిసి భేటీ అయ్యారు. పార్టీ మారే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. పార్టీ మార్పు అంశంతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ కేటాయింపు, మల్లారెడ్డి కళాశాల రోడ్డు తొలగింపు, రాజశేఖర్ రెడ్డి కళాశాల భవనాలకు కూల్చివేత ఈ అంశాలన్నీ చర్చించినట్లు సమాచారం.

ఇలా ఉండగా ఏది ఏమైనా తాను పార్టీ మారబోనని కేసీఆర్ తో తేల్చి చెప్పినట్లు తెలిసింది. తమ కుటుంబానికి మల్కాజిగిరి ఎంపీ సీటు వద్దని చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా మరో రెండు రోజులు వెయిట్ చూస్తే పార్టీ మార్పు అంశం తెలిసే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ : BREAKING : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అనుచరుడు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అరెస్ట్..!

మరిన్ని వార్తలు