Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

BREAKING : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అనుచరుడు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అరెస్ట్..!

BREAKING : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అనుచరుడు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అరెస్ట్..!

మాదాపూర్ లో 1000 గజాలు కబ్జా చేసి డబ్బులు డిమాండ్

శేరిలింగంపల్లి , మన సాక్షి:

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రధాన అనుచరుడు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్ ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ లో 1000 గజాల స్థలాన్ని ఆక్రమించి డబ్బులు డిమాండ్ చేసిన శ్రీనివాస యాదవ్, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ ప్లాట్ యజమానిని బెదిరించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట గ్రామంలోని సర్వేనెంబర్లు 4పి, 5పి, 6పీ లలో ఉన్న ప్లాట్ నెంబర్ 61, 61ఏలలో 500 గజాలు చొప్పున మొత్తం 1000 గజాలను బాధిత ప్లాట్ ఓనర్ ఓనర్ 1994లో కొనుగోలు చేశాడు. అనంతర కాలంలో ల్యాండ్ ఓనర్ అమెరికాకు వెళ్లాడు.ఈ భూమిపై కన్నేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రధాన అనుచరుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్ మొత్తం 1000 గజాల స్థలాన్ని ఆక్రమించాడు.

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!

రాజు క్రికెట్ అకాడమీ పేరుతో ఫెన్సింగ్ వేసాడు. ఆ తర్వాత ప్లాట్లలో చెత్తను వేసి గుడిసెలు వేయించాడు. విషయం తెలుసుకున్న ప్లాట్ల యజమాని తన ప్లాట్లను ఖాళీ చేయాలని స్థల శ్రీనివాసయాదవ్ ను అడగ్గా, బెదిరింపులు దిగాడు, స్థలాన్ని ఖాళీ చేయాలంటే తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తానని శ్రీనివాసయాదవ్ ల్యాండ్ ఓనర్ ను బెదిరించాడు.

దీంతో ల్యాండ్ ఓనర్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. మాదాపూర్ పోలీసులు శ్రీనివాసయాదవ్ పై కేసు నమోదు చేశారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు గురువారం శ్రీనివాస యాదవ్ ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ALSO READ : Temple of Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి.. ఎక్కడో తెలుసా..!

మరిన్ని వార్తలు