Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణవ్యవసాయం

Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!

Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారెంటీ హామీలను అమలు చేస్తున్న విషయం విధితమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆరు గ్యారెంటీ హామీల అమలుకు కృషి చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ గృహ పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ముందస్తుగానే ప్రకటించారు.

రైతుబంధు పథకం తొలగించి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు గాను రైతుల ఖాతాలలో జమ చేసేవారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15000 రూపాయలను రెండు సీజన్లకు గాను జమ చేయనున్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం కు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు నిధులు అందరి రైతులకు ఇంకా రాలేదు. ఈ నెలాఖరి లోగా రైతుబంధు జమ అవుతాయని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సీజన్ లో గత ప్రభుత్వం మాదిరిగానే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రైతు ఖాతాలలో జమ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 15000 రాబోయే వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా ఈ పథకం కింద గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు రైతు పెట్టుబడి సహాయం అందింది. కానీ అప్పట్లో అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. వందల ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు సహాయం అందిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా వాటన్నింటిని ఈ ప్రభుత్వం సరిచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

సాగు చేసే రైతులకు మాత్రమే సహాయం అందించాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు సహాయం అందజేసి ఆదుకోవాలని, ఇంకా ఇన్కమ్ టాక్స్ లు చెల్లించే వారికి కూడా సహాయాన్ని అందించొద్దని భావిస్తున్నారు.

ఒక ఎకరం ఉన్న అతనికి వ్యాపారంలో ఎక్కువ సంపాదన ఉండి అతడు టాక్స్ లు చెల్లిస్తున్నట్లయితే అతనికి కూడా రైతు సహాయం నిలిపివేయనున్నారు. అదేవిధంగా కార్లు, బంగ్లాలు ఉన్న వారికి కూడా రైతు బంధు సహాయం ఎందుకని.. సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలని, పేద రైతుల నుంచి డిమాండ్ వస్తుంది. ప్రభుత్వం త్వరలోనే ఈ విషయాలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఆ నిర్ణయం మేరకే రాబోయే వానకాలం సీజన్ లో రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించనున్నారు.

ALSO READ : Temple of Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి.. ఎక్కడో తెలుసా..!

మరిన్ని వార్తలు