Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుయాదాద్రి భువనగిరి జిల్లా

Yadagirigutta : యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం..!

Yadagirigutta : యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం..!

యాదాద్రి భువనగిరి , మన సాక్షి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా యాదగిరిగుట్టకు వచ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు పాల్గొని నరసింహ స్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు, మంత్రుల బృందానికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

యాదగిరిగుట్టకు మొదటిసారిగా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి , కొండా సురేఖ, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, నకిరేకల్ మిర్యాలగూడ శాసనసభ్యులు వేముల వీరేశం, భత్తుల లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.

ALSO READ : Telangana : గులాబి ఖేల్ ఖతం.. ముహూర్తం ఫిక్స్..!

మరిన్ని వార్తలు