Telangana : గులాబి ఖేల్ ఖతం.. ముహూర్తం ఫిక్స్..!

తెలంగాణలో గులాబీ పార్టీ కేల్ ఖతం కానున్నదా..? పార్లమెంట్ ఎన్నికలలోపే ఆ పార్టీకి చిక్కులు రానున్నాయా..? అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.

Telangana : గులాబి ఖేల్ ఖతం.. ముహూర్తం ఫిక్స్..!

బీఆర్ఎస్ ఎల్ పి విలీనంకు ప్లాన్

26 మంది ఎమ్మెల్యేల చేరికకు గాలం వేసినట్లు సమాచారం

మన సాక్షి :

తెలంగాణలో గులాబీ పార్టీ కేల్ ఖతం కానున్నదా..? పార్లమెంట్ ఎన్నికలలోపే ఆ పార్టీకి చిక్కులు రానున్నాయా..? అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వెళ్లి ఆయనను కలుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచినవారు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారిని చేర్చుకోకుండా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భారీగా చేర్చుకొని బిఆర్ఎస్ ఎస్పీ ని విలీనం అయ్యేలా చేసేందుకు రేవంత్ రెడ్డి పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

మొత్తం బీఆర్ఎస్ లో 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 26 మందికి గాలం వేసినట్లు సమాచారం. ఈనెల 11వ తేదీ నుంచి చేరికలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలను ఈ నెల 11వ తేదీ నుంచి చేర్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. 16 మందికి తగ్గకుండా 26 మంది వరకు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని పథకం రూపొందించినట్లు సమాచారం.

ALSO READ : BRS : బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలపై మన సాక్షి కార్టూన్..!

కిందిస్థాయి నాయకులు మాజీ ఎమ్మెల్యేలు , జడ్పీ చైర్మన్లు , జెడ్ పి టి సి, మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ,ఎంపీపీలు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటివరకు గులాబీ జెండాను విడిచి వెళ్లలేదు.

ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేరికతోనే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సభ్యులతో సహా కలిసిన విషయం తెలిసిందే. కాగా ఈనెల 11వ తేదీన బూర్గంపాడు లో రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగానే ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆయన ఇటీవల తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం , మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంకు సంబంధించి సమావేశం నిర్వహించినా కూడా వెంకట్రావు గైరాజరైన విషయం తెలిసిందే.

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!

ఇదిలా ఉండగా 26 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపజేసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి గులాబీ కండువాలు కేసీఆర్ కప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 26 మంది ఎమ్మెల్యేలకు తగ్గకుండా కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహం పన్నినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనెల 11వ తేదీతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

ఎగువ స్థాయిలో బీఆర్ఎస్ కు చెందిన ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అదే విధంగా కిందిస్థాయి నాయకులు అంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. స్థానిక సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.

ALSO READ ; Temple of Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి.. ఎక్కడో తెలుసా..!