Suicide: హైదరాబాద్ లో యువతి ఆత్మహత్య..!
Suicide: హైదరాబాద్ లో యువతి ఆత్మహత్య..!
ములుగు, మన సాక్షి
హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్ లో యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ములుగు జిల్లా నూగుర్ వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన సాహితీ (26) హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ ఎంబీఏ చదువుతోంది. అయితే యువతి వ్యక్తిగత కారణా లతో గదిలో ఉరివేసుకొని చనిపోయింది.
గుర్తించిన హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వగా చైతన్య పురి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి యువతి మృతిపట్ల దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా యువతి సొంతూరు అయిన ములుగు జిల్లా ఆలుబాకలో విషాదం నెలకొంది.
ALSO READ : Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!









