Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : నల్గొండ జిల్లా చిట్యాల లో బాంబుల కలకలం..!

BREAKING : నల్గొండ జిల్లా చిట్యాల లో బాంబుల కలకలం..!

మన సాక్షి :

నల్గొండ జిల్లా చిట్యాల లో బాంబు కలకలం చోటు చేసుకుంది. అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. చిట్యాల మున్సిపాలిటీ నాలుగో వార్డులో సింగిల్ విండో ఆఫీస్ పక్కన ఒక ఇంట్లో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుండగా బాణసంచా ఒక్కసారిగా పేలడంతో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమం కాగా మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని హాస్పిటల్ కు తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాలనీలోని సమీప నివాసాల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాణాసంచాలో జరిగిన ప్రమాదానికి బాంబులు పేలినట్లుగా ఆందోళన చెందారు.

ALSO READ : 

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు