Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Devarakonda : దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తా..!

Devarakonda : దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తా..!

ఎమ్మెల్యే బాలు నాయక్..

చింతపల్లి, మన సాక్షి :

దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. ఆదివారం చందంపేట మండల పరిధిలోని మూడు దండ్ల గ్రామం నుంచి టిఆర్ఎస్ పార్టీకి చెందిన జక్కుల మున్నయ్య, జక్కుల జంగయ్య, దశరథం, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధిక వీరితో పాటు మరో 100 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి దేవరకొండ ఎమ్మెల్యే నే నావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని వారు సాదరంగా ఆహ్వానించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరువు నుంచి రైతులకు సాగు నీరు అందించేందుకు నక్కల నుండి ప్రాజెక్టును పూర్తి చేయించి దేవరకొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని, ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కాలి కావడం ఖాయం అన్నారు. దేవరకొండ ప్రజలే నా బలం బలగమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి దేవరకొండ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ అందించాలని వారు కార్యకర్తలను కోరారు.

మరో 20 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జాల నరసింహారెడ్డి, ఎం ఏ సి రాజు ఖాన్, ముక్కామల వెంకటయ్య ముత్యాల సర్వయ్య, వీటితోపాటు చందంపేట మండలం ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

BIG BREAKING : అధికార పార్టీలోకి గోడలు దూకే నాయకులారా.. మీ పతనానికి చరమగీతం ముందుంది, మిర్యాలగూడలో ఫ్లెక్సీ పై మహిళల దాడి..!

Open Exams : వ్యాపార కేంద్రాలుగా ఓపెన్ టెన్త్ , ఇంటర్ పరీక్ష కేంద్రాలు.. పట్టించుకోని ఉన్నతాధికారులు..!

Komatireddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది..!

మరిన్ని వార్తలు