Breaking NewsTOP STORIESక్రీడలుజాతీయం

Nithish Kumar Reddy: జాక్ పాట్ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. టీమిండియాలో చోటు..!

Nithish Kumar Reddy: జాక్ పాట్ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. టీమిండియాలో చోటు..!

సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఆల్ రౌండర్ గా మెరుపు మెరిసిన నితీష్ కుమార్ రెడ్డి మరోసారి జాక్ పాట్ కొట్టాడు. ఐపీఎల్ 2024 లో మెరుగైన ఆట ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించాడు తెలుగు తేజం.

అతి చిన్న వయసులోనే అతి త్వరలో అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగాడు. జూలై 5వ తేదీన టి20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కనున్నది. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉండటం వల్ల నితీష్ కుమార్ కు చోటు లభించింది అని చెప్పవచ్చును. ఐపీఎల్ లో సత్తా చాటిన ఆటగాళ్లలో యువ జట్టును జింబాంబే పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 24 సీజన్ లో మొత్తం 13 మ్యాచ్ లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 33. 67 సగటుతో 303 పరుగులు చేశాడు. 142.92 స్ట్రైక్ రేటుతో రెండు ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో కీలక బ్యాట్స్ మెన్ లంతా విఫలమైన వేల నితీష్ కుమార్ రెడ్డి (76 నాటౌట్) గా ఉండి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్ లో కూడా మూడు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ అవార్డుతో పది లక్షల నగదు పురస్కారం కూడా ఆయనకు లభించింది. ఏది ఏమైనా అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి నితీష్ కుమార్ రెడ్డి వెళ్లడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : 

Nalgonda : ఆపదతో ఆసుపత్రికి వస్తే డబ్బులు అడుగుతారా..? ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్..!

BREAKING: కన్న కూతురిపై కన్నేసిన కామంధుడు.. హత్య చేసి తప్పించుకుని ప్రయత్నం, కేసు చేదించిన పోలీసులు..!

మరిన్ని వార్తలు