Whatsspp : వాట్సాప్ లో అదిరిపోయే మెటా ఏఐ ఫీచర్.. తెలియని విషయాలు సెకండ్లలో తెలుసుకోవచ్చు..!
Whatsspp : వాట్సాప్ లో అదిరిపోయే మెటా ఏఐ ఫీచర్.. తెలియని విషయాలు సెకండ్లలో తెలుసుకోవచ్చు..!
మన సాక్షి , ఫీచర్స్:
మెసేజింగ్ యాప్ లో అత్యధికమంది వినియోగించేది వాట్సాప్. ప్రపంచంలో కోట్లాదిమంది వాట్సప్ మెసెంజర్ ను వినియోగిస్తుంటారు. వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్ అనేక ఫీచర్స్ ని తీసుకొచ్చింది. అంతేకాకుండా వాయిస్ కాల్, వీడియో కాల్ ఇంకా ఇతర ఫీచర్స్ ను, సెక్యూరిటీ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అదే విధంగా ఇప్పుడు సరికొత్త ఫీచర్ ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వాట్సప్ వినియోగదారులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉంటుంది. మెటా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాఫ్ట్వేర్ తో దీనిని వినియోగించుకోవచ్చును.
వాట్సాప్ ఓపెన్ చేయగానే మెటా ఏఐ ఫీచర్ కనిపిస్తుంది. మెసేజ్ యాప్ లాగానే ఈ యాప్ కూడా వాట్సాప్ లో కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి మనకు అవసరమైన సమాచారం కోసం టైప్ చేసి సెండ్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు సెకండ్లలో వస్తాయి.
ఈ ఫీచర్ ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. కావలసిన సమాచారంతో పాటు మార్కెట్లో కొనుగోలు చేసే వస్తువులను కొనుగోలు చేయాలన్నా.. లేటెస్ట్ ట్రెండింగ్ సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్నా.. మెటా ఏఐ ఫీచర్ ను వినియోగించి తెలుసుకోవచ్చును.
వాట్సాప్ అందించే ఈ కొత్త ఫీచర్ ఇంస్టాగ్రామ్ లో ముందుగానే అందుబాటు ఉంది. కాగా వాట్సప్ వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ ని ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది వాట్సాప్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ALSO READ :
Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?
POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!










